శ్రీశివాని ఆర్ట్స్& పి.ఎస్.మూవీ మేకర్స్ బ్యానర్ పై లింగస్వామి వేముగంటి దర్శకత్వంలో శ్రీశంకర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే వినవా. ప్రముఖ కమెడియన్ గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ, కిరణ్‌చత్వాని జంటగా నటిస్తున్నారు. సాయికుమార్, పోసానికృష్ణమురళి, కోటేశ్వరరావు తదితరులు ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛైర్మన్ మోహన్ వడ్లపాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫిల్మి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ వడ్లపాటి మాట్లాడుతూ… నన్ను అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ తరపున ప్రతి చిన్న సినిమాకి మా తరపు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాకి కూడా మా సహకారాలు తప్పకుండా అందిస్తాము. ఈ మూవీ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు.
డైరెక్టర్ లింగస్వామి మాట్లాడుతూ… నాది తొమ్మిదవ సినిమా నేనుగతంలో కూడా అన్నీ మంచి చిత్రాలు చేశాను. 6 నంది అవార్డులను కూడా అందుకున్నాను. ప్రొడ్యూసర్ నాకు మంచి మిత్రుడు. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. హీరో కృష్ణ యూత్ ఎనర్జిటిక్ హీరో. కృష్ణారావ్ సూపర్‌మార్కెట్‌లో మంచి ఫైటర్ అన్న పేరు వచ్చింది. ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మర్ అని పేరు వస్తుంది. ప్రొడ్యూసర్స్ ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. రెండు పాటలు మలేషియాలో తీశాం. కోటేశ్వర్‌రావు, తిరుపతి దొరై ఈ చిత్రంలో మంచి పాత్రలు పోషించారు. ఐదు పాటలు ఏలేంద్రగారు అందించారు.
హీరో కృష్ణ మాట్లాడుతూ… ఫస్ట్ కాపీ చూశాక చాలా ఆనందంగా ఫీలయ్యాం. ఈ విషయం ప్రెస్‌తో పంచుకోవడానికి ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశాం. ఈ సినిమాలో పాటలు చాలా బాగా కుదిరాయి ఏలేంద్రగారు చాలా థ్యాంక్స్ అన్నారు. వరంగల్ మీద తీసిన మాస్ సాంగ్ చాలా బావుంది. థ్యాంక్స్ టు మై హోల్ టీమ్ . రెండు పాటలు అరకులో, రెండు మలేషియాలో చిత్రీకరించాం. నన్ను యాక్షన్ నుంచి లవర్ బాయ్‌గా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మహావీర మాట్లాడుతూ…మా ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. బ్యాక్‌గ్రైండ్ స్కోర్ గురించి సాయికుమార్‌గారు కూడా నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. హీరో కూడా చాలా బాగా చేశారు. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ప్రతి పాట దర్శకుడు దగ్గరుండి సిట్యువేషన్‌కి తగ్గట్లు రాయించుకున్నారు.
ప్రొడ్యూసర్ శంకర్‌గౌడ్ మాట్లాడుతూవ… నాకు ఈ కథ నచ్చి సినిమా చేశాను. ఇది లవ్ కమ్ ఫ్యామిలీ స్టోరీ మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బస్టాప్ కోటేశ్వరావు, తిరుపతిదొరై, లిరిసిస్ట్ ఘనయాది తదితరులు పాల్గొన్నారు.