“ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు” చిత్రం నుంచి ‘నా కల’ సాంగ్ లాంచ్

144

ఎల్ ఒ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చంద్ర ఎస్ చంద్ర, డా. విజయ రమేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ” ట్రెండ్ మారినా
ఫ్రెండ్ మారడు” . స్నేహానికి ఉన్న అనుబంధం గురుంచి చాలా ఆసక్తిగా ఈ చిత్రం కాన్సెప్ట్ ఉండనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి ‘నా కల… ‘ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ట్రెండ్ మారినా ఫ్రెండ్
మారడు చిత్రం మా బ్యానర్ లో రానుంది. సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు కూడా ఇందులో నటించడం జరిగింది. కొత్త ప్రదేశాలలో షూట్ అందరినీ అలరించనుంది. ఇప్పటికీ షూట్ మొత్తం పూర్తీ కావస్తోంది. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ లతో పాటు చాలా థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేయనున్నాం అన్నారు.

దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ట్రెండ్ మారినా ‘ఫ్రెండ్ మారడు ‘ అనే చిత్రాన్ని ప్రేక్షకులకు త్వరలోనే అందించబోతున్నాం.. ఫ్రెండ్ లేని వారు ఎవరూ ఉండరు.. మన లైఫ్ లో ఫ్రెండ్ ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. ఆ విషయాన్నే ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఈ రోజు “నా కల ” అనే పాటను విడుదల చేయడం జరిగింది చేసిన కొద్ది నిమిషాల్లోనే మంచి స్పందన అందింది. ఇందులో నటించిన హీరో ఇంద్ర చాలా సుపరిచితుడే.. తను నటించిన ఇది వరకు చిత్రాలకు మంచి ప్రెక్షాదరణ పొందినవే.. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సింగర్ సునీత గారు గురించి. అప్పట్లో గులాబి చిత్రంలో ఈ వేళలో పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. అదే తరహాలో ఇప్పుడు ఈ చిత్రంలో కూడా మంచి సాహిత్యం తో పాటు సునీత గారి గాత్రం తోడయ్యింది. ఆ పాట కూడా ప్రెక్షాడారణ పొందుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. అన్నీ కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసుకొని చిత్రం విడదల చేయనున్నాం అన్నారు.

హీరో ఇంద్ర మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించి నందుకు దర్ధక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. మంచి పాత్ర డిజైన్ చేశారు. ఈ చిత్రం తో ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవుతానని ఆశిస్తున్నా.. నా సహ నటీనటులు అందరూ సహకరించి నటించారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ భరద్వాజ మాట్లాడుతూ… మంచి సంగీత సాహిత్యం కలిగిన పాటలు ఈ చిత్రంలో ఉన్నాయి అందుకు అనుగుణంగా బాణీలను అందించడం జరిగింది. విడులైన ‘నా కల ‘ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. నిర్మాతల సహకారం ఎంతో ఉంది కనుకే ఈ చిత్రం ఇంత వరకు వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

ఇంకా ఈ కార్య్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నటీనటులు : ఇంద్ర , కోమల్ నాయర్ , దీపు , స్వాతి శర్మ , ఇమ్రాన్ , షీతల్ భట్
ఆర్ట్స్ : చంద్ర S చంద్ర
కొరియోగ్రఫర్: G. శైలజ
లిరిక్స్ : గణేష్ .A
కాస్ట్యూమ్స్ : రామకృష్ణ
మేకప్. : Y. రామకృష్ణ
రచన : కృపాకర్
DOP: రాహుల్ మాచినేని
ఫైట్స్. : దేవరాజ్ నూనె
స్టిల్స్. : మరపు నాగేశ్వర రావు
ప్రెసెంట్స్ : U. మేఘనాథ్ , JGM లోకేష్
ఎడిటింగ్: అద్వైత్ వినోద్
మ్యూజిక్ : శ్రవణ్ భరద్వాజ్
ప్రొడ్యూసర్స్ : చంద్ర S చంద్ర , డా..విజయ రమేష్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే దర్శత్వం : లక్ష్మణ్ జెల్ల
పి ఆర్ ఓ: బాబు నాయక్ (సినీ లోకం magzine)