HomeTeluguమై నేమ్ ఈజ్ శృతి’ సక్సెస్‌తో కష్టమంతా మరిచిపోయా: హన్సిక*

మై నేమ్ ఈజ్ శృతి’ సక్సెస్‌తో కష్టమంతా మరిచిపోయా: హన్సిక*


బబ్లీ బ్యూటీ హన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. స్కిన్ మాఫియా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇటువంటి నేపధ్యంలో సినిమా రాలేదు. స్కిన్ మాఫియా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో హన్సికగారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆమె అనారోగ్యంతో ఉండి కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నాను. కొత్త నిర్మాతనైన నాకు సినిమా నిర్మాణం సమయంలోనే కాకుండా.. విడుదల తర్వాత కూడా టీమ్ అంతా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్యూ సో మచ్. ‘మై నేమ్ ఈజ్ శృతి’లో మంచి మెసేజ్ ఉంది. సినిమా చూడని వారు.. ఈ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

దర్శకుడు శ్రీ‌నివాస్ ఓంకార్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు మీడియాకు షో వేశాం. షో అనంతరం మీడియా సోదరులు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మరుసటి రోజు సినిమా విడుదలైన తర్వాత కూడా నేను అదే ఫీడ్‌బ్యాక్‌ని గమనించాను. ఒక కొత్త దర్శకుడిని.. కొత్త నిర్మాత నమ్మడం అనేది మాములు విషయం కాదు. ఈ మూవీతో ఓ మంచి నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పే సమయంలో హన్సికగారికి ఒక ప్రామిస్ చేశాను. తన బెస్ట్ 10 మూవీస్‌లో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. ఈ రోజు ఈ సినిమాకు వస్తున్న రివ్యూలు, రేటింగ్‌లు చూస్తుంటే.. నేను నా ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. పేరేంట్స్ పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ, మీడియాకు మరొక్కసారి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.

హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాకు థ్యాంక్యూ. ఈ సినిమా కోసం నిర్మాత, దర్శకుడు ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది జెన్యూన్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాకు వస్తున్న టాక్, రేటింగ్స్‌.. పడిన కష్టమంతా మరిచిపోయేలా చేశాయి. ఇటువంటి మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడితో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది. అలాగే నిర్మాత చాలా స్వీట్ అండ్ గుడ్ పర్సన్. ఒక సక్సెస్‌ఫుల్ సినిమా తీయాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారు. దర్శకనిర్మాతల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి ఆల్ ది బెస్ట్. మా అందరితో మరిన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం అంతా సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES