కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.. ‘కాలింగ్ సహస్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్

131

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘నేను ఈ కథను చాలా ఏళ్ల క్రితం విన్నాను. సాఫ్ట్ వేర్ సుధీర్ కంటే ముందే ఈ కథను విన్నాను. గాలోడు, ఈ చిత్రం రెండూ ఒకేసారి ప్రారంభించాం. గాలోడు హిట్ అయింది. మాస్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రాబోతోన్నాను. ఈ జానర్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాలని అనుకుంటున్నాను. వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తాను. మార్క్ కే రాబిన్, గ్యారీ గారు రావడంలో మా సినిమా స్థాయి పెరిగింది. డిసెంబర్ 1న మా చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సినిమా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండి’ అని అన్నారు.

దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ.. ‘ఈ కథ రాసుకున్నప్పుడు నేను ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. నా కథ సుధీర్ వల్ల చాలా మందికి వెళ్తుందని అనుకుని తీసుకున్నాను. హాలీవుడ్‌లా ఉందని.. నాకు కథ చెబుతున్నారు.. నేనేనా హీరోని? అని సుధీర్ అన్నారు. సుధీర్ గారు ఏ సినిమాను అంగీకరించక ముందే ఈ కథను ఓకే చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్‌ మీద సినిమా రాలేదు. నా టీం సహకరించడం వల్లే సినిమా బాగా వచ్చింది. మార్క్ కే రాబిన్ ఆర్ఆర్, సన్నీ కెమెరాపనితనం, మోహిత్ పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి.

నిర్మాత విజేష్ త‌యాల్‌ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు అద్భుతంగా తీశారు. సుధీర్ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలవు. మీడియానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి’ అని కోరారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసి సలహాలు ఇస్తాం. కొంత మంది వాటిని తీసుకుంటారు. ఇంకొంత మంది పట్టించుకోరు. టీం అంతా కలిసి ఇష్టంగా ఈ సినిమాను తీసినట్టుగా నాకు అనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. మంచి స్క్రిప్ట్‌తో రాబోతోన్నారు. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నా వంతుగా సాయం చేస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో రాబోయే ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ అందరికీ తెలుసు. అందరినీ ఈ చిత్రం సంతృప్తి పరుస్తుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. డిసెంబర్ 1న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నేను ఇక్కడ ఉండటానికి కారణం వాళ్లే. నన్ను నమ్మి పాత్రను నాకు ఇచ్చిన అరుణ్ విక్కిరాలా సర్‌కు థాంక్స్. సుధీర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ.. ‘అరుణ్ అన్న డైరెక్షన్, సన్నీ అన్న కెమెరాపనితనం అద్భుతంగా ఉంది. నిర్మాతలకు అడ్వాన్స్‌గా కంగ్రాట్స్.

ఆర్ఆర్ ఇచ్చిన మార్క్ కే రాబిన్ మాట్లాడుతూ.. ‘దర్శకుడికి ఇది కొత్త సినిమా. అందరూ ఆయన్ను ప్రోత్సహించాలి. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. మోహిత్ సాంగ్స్, సన్నీ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. సుధీర్ గారు అద్భుతంగా నటించారు. అందరూ సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

కెమెరామెన్ శశికిరణ్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆనుకుంటున్నాను. అరుణ్ చాలా విషయాల్లో క్లారిటీగా ఉంటారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘కాలింగ్ సహస్ర టీంకు అడ్వాన్స్‌గా కంగ్రాట్స్. సుధీర్ గారు కొత్తగా కనిపిస్తున్నారు. సినిమాకు టీంకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ మూవీలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.

న‌టీన‌టులు:
సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్, రచన దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా, నిర్మాతలు:  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి, సంగీతం : మోహిత్ రెహమానియక్, బ్యాగ్రౌండ్ స్కోర్ : మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ : సన్ని.డి, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌, ఆడియో: ఆదిత్య మ్యూజిక్, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర‌, ఫ‌ణి (బియాండ్ మీడియా).