ఐ యామ్ ఏ సెలబ్రిటీ ( I’m A Celebrity ) అంటున్న రఘు కుంచే

391

గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా , నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఒక వైపు సంగీత దర్శకుడిగా మరో వైపు నటుడిగా ఎన్నో సినిమాలు చేస్తూ , తాను చవిచూసిన అనుభవాలను “ఐ యామ్ ఏ సెలబ్రిటీ” ( I’m A Celebrity) పేరుతో, తనే లిరిక్స్ ని అందించి , మ్యూజిక్ కంపోజ్ చేసి , తనే పాడిన ,ఒక వినోదాత్మకమైన పాటను మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు ఆ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట విడుదల అయిన సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ “ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలి అని ఉంటుంది కానీ ,ఆ గుర్తింపు కొందరికే వస్తుంది. కృషి పట్టుదలతో కొందరు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అందరిని మెప్పిస్తారు , అందుకే సమాజంలో వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తారు, ఒక సెలబ్రిటీ హోదా ఇస్తారు. సినిమా రంగం అయిన, పొలిటికల్ రంగం విద్యారంగం అయిన , ప్రజలని మెప్పించ గలిగితే చాలు వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు. కానీ ఈ సెలబ్రిటీ హోదాని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం వల్ల, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఏమి చేసిన అది మంచి అయినా చెడు అయినా ఒక పెద్ద వైరల్ గా మారుతుంది . నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ జీవితం కత్తి మీద సాము లాగా అయిపోయింది. వాళ్ళు ఏమి చేసిన సోషల్ మీడియా లో అదొక పెద్ద వార్త అవుతుంది , మీమ్ అవుతుంది ,యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది. వీటన్నిటి ఆధారంగానే దీన్ని ఒక వినోదభరితమైన పాట గా మలిచాను.

ఐ యామ్ ఏ సెలబ్రిటీ (I’m A Celebrity) పాట మీకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. మరియు , ఈ పాట కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే తప్ప , ఎవరినో కించపరచడానికో, లేక తక్కువ చేయడానికో చేసింది కాదు . ఎవరి మనసులనైనా కష్టపెడితే , క్షమించమని ముందుగానే కోరుకుంటున్నాను .