డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతులమీదుగా మిస్టర్ అండ్ మిస్ ట్రైలర్ లాంచ్ !!!

543

తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది.
తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…
మిస్టర్ అండ్ మిస్ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నేను పెద్ద సినిమా చిన్న సినిమా అనేది నమ్మను, మంచి సినిమానా కాదా అనేది నమ్ముతాను. ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా చూసి ఆడియన్స్ కచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ తో నాకు మంచి అనుబంధం ఉంది, తాను ఫస్ట్ టైమ్ కెమెరామెన్ గా చేస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్
మరిన్ని మంచి మూవీస్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ…
ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది, మా ట్రైలర్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదాలు. మేము అందరూ కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న పాయింట్ అందరిని ఆలోచింపజేస్తుంది. డైరెక్టర్ అశోక్ గారు సినిమాను బాగా తీశారు, మార్చి ఎండింగ్ లో వస్తోన్న మా సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో శైలేష్ సన్నీ మాట్లాడుతూ…
మా సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చెయ్యడం నిజంగా గర్వంగా ఉంది. మా సినిమాకు క్రౌడ్ సపోర్ట్ ఉంది. రేపు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ అశోక్ , యశ్వంత్ నాగ్ సంగీతం సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది. మా టీమ్ అందరూ కలసి చేసిన మ్యాజిక్ రేపు ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు

డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ…
మిస్టర్ అండ్ మిస్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమా చేశాం. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా చేయడం జరిగింది. సుధీర్ వర్మ రైటింగ్, మనోహర్ కెమెరా వర్క్, కార్తిక్ ఎడిటింగ్, యశ్వంత్ నాగ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలైట్స్ కానున్నాయి, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్, సుజిత్ కష్టపడి వర్క్ చేశారు. మార్చి చివర్లో విడుదల కానున్న మా సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి అన్నారు.

పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్
కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి,కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్
డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ :
జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.