HomeTeluguఘనంగా ‘ఐ హేట్‌ లవ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

ఘనంగా ‘ఐ హేట్‌ లవ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

రావి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకటేష్‌ వి. దర్శకత్వంలో సుబ్బు`శ్రీవల్లి జంటగా డా॥ బాల రావి (యు.ఎస్‌.ఏ) నిర్మించిన చిత్రం ‘ఐ హేట్‌ లవ్‌’. ఈనెల 16.న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత బాలాజీ నాగలింగం, ప్రముఖ దర్శకుడు మల్లిఖార్జున(మల్లి).శశి చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నాయుడు. జబర్దస్త్ నాగి.. అశోక్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత డా॥ బాల మాట్లాడుతూ…
మమ్మల్ని సపోర్ట్‌ చేయటానికి వచ్చిన అందరికీ థాంక్స్‌. నేను ఇండియా వదిలి వెళ్లి 47 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఇండియాకు వచ్చాను. ఈ సినిమా విషయంలో ప్రముఖ నిర్మాత బాలాజీ నాగలింగం గారు నాకు చాలా అండగా నిలబడ్డారు. నేను ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలని మా ఊర్లో ‘రావి ఫౌండేషన్‌’ పెట్టి అనేక మందికి విద్య, ఉపాధి, వివిధ రంగాల్లో ట్రైనింగ్‌ ఇచ్చాము. ఈ సినిమా ద్వారా నలుగురుకి ఉపాధి దొరుకుతుందని ఈ ‘ఐ హేట్‌ లవ్‌’ చేశాను. ఈ చిత్రం ప్రేమకథ అయినా.. డీప్‌గా చూస్తే సోషల్‌ మీడియా వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి. ప్రేమలు ఎలా చెడిపోతున్నాయి అనేది అండర్‌ కరెంట్‌గా ఉంటుంది. సంప్రదాయాలు, త్యాగాల వల్లనే నిజమైన ప్రేమ నిలబడుతుందని చెపుతున్నాం. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీశాం. అందరికీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.

ప్రముఖ నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ…
ఈ సినిమాను మంచి ప్యాషన్‌తో చేశారు. హీరో, హీరోయిన్‌లు చక్కగా కుదిరారు. మంచి ఉద్దేశంతో మొదలు పెట్టిన ఈ బ్యానర్‌పై మరిన్ని చిత్రాలు డా॥ బాల రవి గారు చేయాలని కోరుకుంటున్నా. తెలుగు పరిశ్రమ అంతా ఒక్కతాటిమీద నిలబడితే తెలుగు సినిమా సత్తా అంటే ఏమిటో చూపించవచ్చు. ఈ సినిమా విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అన్నారు.

జబర్‌దస్త్‌ నాగి మాట్లాడుతూ…
నేను ఊర్లో ఉండగా నాకు ఈ అవకాశం వచ్చింది. నాకు మంచి క్యారెక్టర్‌ వచ్చింది… గోదావరి స్లాంగ్‌తో మంచి లొకేషన్స్‌లో సినిమా చేశారు. తప్పకుండా ఆకట్టుకుంటుంది. మంచి డైలాగ్స్‌ కూడా ఉంటాయి అన్నారు.

హీరో సుబ్బు మాట్లాడుతూ…
థియేటర్‌ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు మంచి సినిమా చూశామని ఫీలయ్యేలా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన, దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంతకు ముందు కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు బ్రేక్‌ ఇచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. అందరూ థియేటర్‌కు వచ్చి చూడండి.. మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు.

దర్శకుడు వెంకటేష్‌ మాట్లాడుతూ…
నన్ను నమ్మి నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నిర్మాత డాక్టర్‌ రావి బాలా గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో నన్ను అభిమానించి ప్రోత్సహించిన దర్శకులు మల్లిఖార్జున్‌ గారికి కూడా రుణపడి ఉంటాను. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఈ ‘ఐ హేట్‌ లవ్‌’. సబ్బు`శ్రీవల్లి అద్భుతంగా సెట్‌ అయ్యారు. పచ్చని కోనసీమలా.. ఈ లవ్‌స్టోరీ కూడా అందంగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చిన్నగా చేద్దామనుకున్నప్పటికీ నిర్మాత గారు సినిమాకు ఏం కావాలో అది అరేంజ్‌ చేసుకోండి. బడ్జెట్‌ గురించి ఆలోచించవద్దు. నువ్వు సినిమా మీదే ఫోకస్‌ చెయ్యి అని ధైర్యం ఇచ్చారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. 16.వ తేదీన థియేటర్స్‌కు వచ్చి చూసి, మమ్మల్ని ఆదరించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా అన్నారు.

కిట్టయ్య, భీమరాజు, జబర్దస్త్‌, నాగి, అశోక్‌, తేజ, మల్లెడి రవి, రమణి, రాధికా తదితరులు నటించిన ఈ సినిమాకు మ్యూజిక్‌ :పి.ఆర్‌. పెద్దపల్లి రోహిత్‌, ఎడిటర్‌ :టి.సి. ప్రసన్న, డీఓపీ :వాసు నాయక్‌, ఫణి, కో ప్రొడ్యూసర్‌: పాలగుమ్మి వెంకట కృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ :అంగర శివ సాయి గౌడ్‌, పి.ఆర్.ఓ: లక్ష్మీనివాస్, ప్రొడ్యూసర్‌ : డా॥బాల రావి (యుఎస్‌ఏ), డైరెక్టర్‌ :వెంకటేష్‌. వి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES