అంగ‌రంగ వైభవంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్

324

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. అక్టోబర్ 15న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాత లు ఈ సందర్భంగా..

చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ .. గీతా ఆర్ట్స్ లోగాని,జి.ఏ 2 లో గాని సినిమాలు హిట్స్ అయ్యాయి అంటే అవి మా వల్ల కాదు అవి మీ వల్లే..అందుకే ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇండియాకు మన తెలుగు ప్రేక్షకులు ఒక లెషన్ నేర్పించారు. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వస్తారనే నమ్మకాన్ని హిందీ వారికి మన తెలుగు వారు కలిగించారు..కరోనా వలన సినిమా విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని విన్నవించు కుంటున్నాము ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయవలసిందిగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరుతున్నాము. అలాగే హీరో హీరోయిన్లు ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు.

నిర్మాత బన్నీ వాసు, వాసు వర్మ లు మాట్లాడుతూ.. ఈ కథ మాకు నచ్చడంతో సినిమా షూట్ కి వెళ్ళడం జరిగింది. ఒక రిలేషన్షిప్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్ ని దర్శకుడు చూపించాడు .మేము చాలా కథలు వింటూ ఉంటాం కానీ కొన్ని కథలు లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అలాంటిదే ఈ కథ. నా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ 100 శాతం చేంజ్ అయ్యిందని చెప్పలేను కానీ ఈ సినిమాలో ఉండే ఆరు క్వశ్చన్ లు నా లైఫ్ లో అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి . ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తి తన భార్య చేయి పట్టుకుని వెళ్తాడని ఖచ్చితంగా చెప్పగలను.అందుకే మాకు ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మాట్లాడుతూ. .నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ రాయను .లైఫ్ గురించి ఎక్కువగా రాస్తాను.లైఫ్ స్టొరీ లో లవ్ స్టొరీ వస్తుంది. మనిషి లైఫ్ ను ఎలా లీడ్ చెయ్యాలి అనే కొశ్చన్ కు ఒక దారి దొరికితే దాన్ని ఫాలో అయ్యాను.ఇదంతా రాయడం నాకు చాలా స్త్రగుల్ అనిపించింది.. అయినా వాసు వర్మ నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఫ్రెస్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అఖిల్ ను ఈ సినిమాలో ఫ్రెస్ గా చూస్తారు. అఖిల్,పూజ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే బన్నీ వాసు, అరవింద్ గార్ల సపోర్ట్ తో ఇక్కడిదాక వచ్చింది . అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఐ ఓపెనర్ గా ఉంటుంది ఈ సినిమా ను ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని గుర్తు చేసుకుంటారు. సినిమా లో చాలా బాగుంటుంది . దర్శకుడు భాస్కర్ చాలా చక్కగా తీశాడు.నిర్మాతలు ఒక బ్రిడ్జి లా ఉండి మాకు సపోర్ట్ గా నిలిచారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం పెద్ద విజయం సాదించాలని అన్నారు.

న‌టీ న‌టులు :

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Eluru Sreenu
P.R.O