కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ భారత చైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు డాక్టర్ మహ్మద్ రఫీ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు జితేంద్ర కుమార్ (ఢిల్లీ) నియామక పత్రం విడుదల చేశారు. మహ్మద్ రఫీ ఈ పదవి లో సంవత్సరం పాటు కొనసాగుతారు. తనపై నమ్మకం తో ఇంతటి బాధ్యత ను అప్పగించినందుకు మహ్మద్ రఫీ ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధి తో కృషి చేస్తానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ గా మహ్మద్ రఫీ
RELATED ARTICLES