ఘనంగా “మిస్సింగ్” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం

801


హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “మిస్సింగ్“. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై “మిస్సింగ్” మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ…మిస్సింగ్ సినిమా 2019 నవంబర్ లో మొదలుపెట్టాం. కరోనా ఎఫెక్ట్ అందరితో పాటు మాపైనా పడింది. సినిమా షూటింగ్ ఆలస్యమైంది. హీరో, డైరెక్టర్ ఇద్దరు మా పిల్లలే. నేను డైరెక్టర్ తండ్రిని. హీరో ఫాదర్ శేషగిరి రావు మరో నిర్మాత. సినిమా తీయాలనే కోరిక వాళ్లకు ఎంత ఉండేదో సినిమా చేయాలనే కోరిక మాకూ అంతే ఉండేది. అందుకే మా పిల్లలతో సినిమా నిర్మించాం. మా అబ్బాయి మారుతి అంత పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా. నేను బన్నీ వాసు అంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటే స్వార్థం అవుతుందేమో. మా సినిమాకు బన్నీ వాసు, మారుతి గారు సహకారం అందించాలని కోరుతున్నా. అన్నారు.

నిర్మాత లక్ష్మీ శేషగిరి రావు మాట్లాడుతూ…ఇది మా మొదటి ప్రయత్నం. మా అబ్బాయి హీరో అని కాకుండా, భాస్కర్ గారి అబ్బాయి దర్శకుడు అని కాకుండా, ఓ మంచి చిత్రానికి మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు అజయ్ మాట్లాడుతూ….ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. మంచి పాటలు ఇచ్చానని నమ్మకంతో ఉన్నా. అశోక్ వల్ల మిస్సింగ్ మూవీ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. చక్కటి ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ…మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన అన్నయ్య బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి గారికి థాంక్స్. ఈ కొవిడ్ వల్ల 2020 మిస్ అయ్యింది. 2021 కూడా మిస్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఒక థ్రిల్లర్ జానర్ మూవీ చేయాలనే కోరికతో ఈ స్టోరీ అనుకున్నాం. మన పేరెంట్స్ మనకు సపోర్ట్ చేయడం అనేది చూస్తుంటాం. వాళ్లకున్నదంతా అమ్మేసి మరీ సపోర్ట్ చేసేవాళ్లను కొద్ది మందినే చూస్తాం. మా ఫాదర్ భాస్కర్ గారు, హీరో ఫాదర్ శేషగిరి రావు గారు అలా మా కలను నిజం చేశారు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. సినిమాటోగ్రాఫర్ జన లేకుంటే మిస్సింగ్ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యసర్ సాయి మాకు ఎంతో వర్క్ చేశారు. మిస్సింగ్ లో బెస్ట్ మ్యూజిక్ వింటారు. థియేటర్ లో సినిమా ఉండాలనేది మా కోరిక. మిస్సింగ్ మూవీ నా టీమ్ ఎఫర్ట్. అన్నారు.

హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ…ఈ రోజు కోసం మా టీమ్ అంతా ఎదురుచూస్తున్నాం. మిస్సింగ్ ఇకపై మిస్ అవదు. నాకు తెలుగు కష్టమైనా సినిమా టీమ్ షూటిగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. నేను చాలా కంఫర్టబుల్ గా పనిచేశాను. మిస్సింగ్ సినిమాకు గ్రేట్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో హర్ష మాట్లాడుతూ…. బలంగా నమ్మి చేసే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా మూవీ మిస్సింగ్ ను మేము అంతే నమ్మి పనిచేశాం. కాబట్టి ష్యూర్ గా విజయం సాధిస్తుంది. ఈ క్యారెక్టర్ లో నేను నటించగలనా అని భయపడినప్పుడు, నా ఫ్రెండ్, డైరెక్టర్ శ్రీని సపోర్ట్ చేసి , నువ్వు నటించగలవు అని ధైర్యం చెప్పాడు. శ్రీనికి నా థాంక్స్. యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్నీ కథలో ఉన్న మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవడం సంతోషంగా ఉంది. మీరు సినిమా చూడండి, ఎవర్రా వీళ్లు అనుకునేట్లు చేస్తాం. అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ….గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ కరోనా వల్ల ఇబ్బందులు పడుతోంది. పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న చిత్రాల దాకా అన్నింటిమీదా ఎఫెక్ట్ పడింది. అనుకున్న డేట్స్ కు సినిమాలను రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. అందుకే మా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఎన్ని వీలైతే అన్ని సినిమాలను రిలీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలబడవలసిన సమయం ఇది. డైరెక్టర్ శ్రీని మా పిల్లా నువ్వు లేని జీవితం చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. టాలెంటెడ్ టెక్నీషియన్ తను. మిస్సింగ్ మూవీ ట్రైలర్ బాగుంది. విడుదల విషయంలో కాస్త ఓపిక పట్టండి, ఆగస్టు, సెప్టెంబర్ లో పరిస్థితి సెట్ అయితే మల్లీ థియేటర్లకు జనం బాగా వస్తారని ఆశిస్తున్నాం. సినిమా చేయాలన్న వాళ్ల పిల్లల కలను పేరెంట్స్ నిజం చేయడం గొప్ప విషయం. మిస్సింగ్ మూవీని థ్రిల్లింగ్ గా లాస్ట్ మినట్ వరకు ఆసక్తికరంగా తీసుకెళ్లారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మూవీ చూసి. మ్యూజిక్, ఆర్ఆర్ చాలా బాగుంది. మీరు పెట్టిన డబ్బులకు థియేటర్లో మంచి రెవెన్యూ వస్తుంది. అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ…మిస్సింగ్ ట్రైలర్ చూస్తే ఒక క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తోంది. ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్ కనిపిస్తోంది. బడ్జెట్ చిన్నదా పెద్దదా కాదు ఓ మంచి సినిమా చేశారని చెప్పగలను. మనల్ని లైఫ్ లో నమ్మాల్సింది తండ్రి. ఆ తండ్రే ప్రోత్సహించి వీళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఇంతకంటే బ్లెస్సింగ్స్ ఎవరివీ అక్కర్లేదు. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మిస్సింగ్ టైటిల్ లాగే ఈ సినిమాను ఎవరూ మిస్ అవరు అనుకుంటున్నా. తప్పకుండా ప్రేక్షకులు మిస్సింగ్ సినిమా చూస్తారు. సక్సెస్ మీట్ కు కూడా మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నా. అన్నారు

సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం – వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ – వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ – టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ – దీక్ష రెడ్డి, ఆర్ట్ – దార రమేష్ బాబు, పైట్స్ – పి. సతీష్, డాన్స్ – బంగర్రాజు, జీతు, స్టిల్స్ – గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ – బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం – అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ – జనా. డి, పీఆర్వో – జీఎస్ కె మీడియా, నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం – శ్రీని జోస్యుల.