మీర్జాపూర్ 1 ను మించిన ఎంట‌ర్ టేన్మెంట్ ఇస్తుంది మీర్జాపూర్ 2 – పంక‌జ్ త్రిపాఠి

1116

ప్ర‌ముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌లైన సూప‌ర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజ‌న్ 2 అక్టోబ‌ర్ 23న రాబోతుంది. సీజ‌న్ 1లో ఖాలీన్ భ‌య్యాగా ఫేమెస్ అయిన న‌టుడు పంక‌జ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సంద‌ర్భంగా తెలుగు సినీ పాత్రికేయ‌ల‌తో ముచ్చ‌టించారు, ఆయ‌న‌తో జ‌రిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్

* మీర్జాపూర్ సీజ‌న్ 1 లో నేను పోషించిన కాలిన్ భ‌య్య పాత్ర న‌న్ను తెలుగు ఆడియెన్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. రోజుకి సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చ‌దువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజ‌న్ 2 రాబోతుంద‌నే ప్ర‌క‌ట‌ణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని న‌న్ను చాలా మంది తెలుగు ఆడియెన్స్ అడుగున్నారు, సీజ‌న్ 1 మాదిరిగానే సీజ‌న్ 1 కూడా తెలుగులో డ‌బ్ చేసి అమెజాన్ వారు విడుద‌ల చేస్తున్నారు

* మీర్జాపూర్ 2 లో నా పాత్ర న‌డిచే ధొర‌ణి సీజ‌న్ 1 కంటే చాలా బాగుటుంది, నా పాత్ర ద్వారా ఊహించని ట్విస్ట్ లు ఎదురు అవుతాయి. సీజ‌న్ 2 ఆద‌త్యంతం ఆడియెన్స్ కి అల‌రించే రీతిర రెడీ అయింది.

* ఓటిటిలు కార‌ణంగా కొత్త టాలెంట్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి, చాలా మంది నా వంటి న‌టులకు ప‌ని దొరుకుంది. ఎక్క‌డో బీహార్ లోని ఓ మారుమూల ప‌ల్లెటూరు నుంచి నేను ఇంత దూరం రాగ‌లిగాను అంటే ఫీచ‌ర్ ఫిల్మ్స్ తో పాటు ఓటిటిలే నాకు దొరికిన అవ‌కాశాలే కార‌ణం, అలానే న‌న్ను ఆదిరిస్తున్న ఆడియెన్స్ కూడా దీనికి ముఖ్య కార‌ణంగా భావిస్తున్నాను

* మీర్జాపూర్ సీజ‌న్ 2 సీజ‌న్ వ‌న్ కంటే ఉత్కంఠ‌గా ఉంటుంది, ఆడియెన్స్ ని మ‌రింత‌గా అల‌రిస్తోంది.