హైదరాబాద్ వరద బాధితుల కోసం ”విజయ్ దేవరకొండ” రూ.10 లక్షల విరాళం

735

హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తన వంతుగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందించారు. ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ స్పందిస్తూ…”మనం కేరళ కోసం, చెన్నై కోసం, సైనికుల కోసం అండగా నిలబడేందుకు ముందుకొచ్చాం. కరోనా టైమ్ లో వేలాది మందికి సహాయాన్ని
అందించాం. ఇప్పుడు మన నగరం కోసం అండగా నిలబడేందుకు ముందుకొద్దాం. నా వంతుగా 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నా. మీ అందరూ కూడా మన హైదరాబాద్ కోసం తోచినంత సాయం చేయండి ” అంటూ పిలుపునిచ్చారు..విజయ్ దేవరకొండ విరాళంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ”చాలా థాంక్స్ బ్రదర్” అంటూ రీట్వీట్ చేశారు.