న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో

468


రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌లో న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్ కౌర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న చారిటీ షో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ మోడల్స్‌ పాల్గొన్న ఈ ర్యాంప్ వాక్ షో అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. అబ్దుల్ సర్వార్ కొరియోగ్రాఫ‌ర్‌గా.. తైరీన్ బసిరికట్టి, ముఖేష్ దుబే డిజైనర్లుగా.. ఫెమినా లదానీ మేకప్ ఆర్టిస్ట్‌గా.. వీజే రాఖీ హోస్ట్‌ చేసిన ఈ షోలో మోడల్స్ తమ సోయగాలతో ఆహుతులను అలరించారు. అనంతరం హైదరాబాద్ మహానగరంలో ఇంత పెద్ద చారిటీ షోని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని న్యూట్రాన్ డైరెక్టర్స్ తెలిపారు. మున్ముందు ఇలాంటి షోలు మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇంత పెద్ద షోకి ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, మోడల్స్ ధరించిన డిజైన్స్, టోటల్ షో.. ఎంతగానో అలరించిందని రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ తెలిపారు. షో అనంతరం పేదలకు న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ చెక్కుల పంపిణీ చేశారు.