HomeTeluguమత్తు వదలరా టీజర్‌ను విడుదల చేసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్

మత్తు వదలరా టీజర్‌ను విడుదల చేసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్

మీ ఇద్దరిని డేడికేషన్, టాలెంట్‌కు మారుపేరులా నిర్వచించవొచ్చు. రంగస్థలం సమయంలో సింహాతో కలిసి వర్క్ చేశాను. ఆ ప్రయాణం మరపురానిది. మా నటుల ప్రపంచంలోకి సింహాకు స్వాగతం పలుకుతున్నా. కాలభైరవ విలక్షణ గాత్రానికి నేను పెద్ద అభిమానిని. ఆయన పాటల్ని వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.ప్రముఖ కథానాయకుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. ఈ చిత్ర టీజర్‌ను రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ తన అభినందనలు తెలియజేశాడు. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చింబోయే అంశం అతినిద్ర యొక్క లక్షణాలు. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం అంటూ ఓ రేడియో వ్యాఖ్యనంతో టీజర్ ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో మనస్తత్వం వున్న కథానాయకుడిగా శ్రీ సింహా ఈ టీజర్‌లో కనిపిస్తున్నాడు. అన్ని అంశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మర్డరీ సస్పెన్స్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ్త నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం అన్నారు. నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES