“మరో ప్రస్థానం” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

363

యువ కథానాయకుడు తనీష్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం. ఇందులో ముస్కాన్ సేథీ కథానాయిక. ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మరో ప్రస్థానం’ కావడం విశేషం. అతి త్వరలో ” మరో ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ఉదయ్ కిరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ తనీష్‌ పుట్టినరోజు సందర్భంగా “మరో ప్రస్థానం” టీమ్ ఆయనకు బర్త్ డే విశెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

తనీష్ కెరీర్ ను గమనిస్తే దేవుళ్లు, మన్మథుడు తదితర చిత్రాల్లో బాలనటుడుగా నటించి మెప్పించిన తనీష్ సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా నచ్చావులే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రవిబాబు దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన నచ్చావులే సినిమాతో యూత్ ని మెప్పించాడు. మంచి విజయాన్ని సాధించాడు. ఆతర్వాత రైడ్, ఏం పిల్లో, ఏం పిల్లడో, మేం వయసుకువచ్చాం, తెలుగుబ్బాయి తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సస్ సాధించాడు. తాజాగా నటించిన చిత్రం మరో ప్రస్థానం. అయితే.. తనీష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ మరో ప్రస్థానం మరో ఎత్తు అని చెప్పచ్చు.

కారణం ఏంటంటే.. ఇప్పటి వరకు చేయని పాత్రను మరో ప్రస్థానం చిత్రంలో పోషించాడు. ఇది ఇంటెన్స్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్. ఈ క్యారెక్టర్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకుని తనీష్ చేశాడు. పాత్రను.. ఆ పాత్ర స్వభావాన్ని బాగా అర్ధం చేసుకోవడంతో శభాష్ అనిపించేలా నటించాడు తనీష్‌ అని టాక్ వినిపిస్తోంది. అతని పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్ గా తనీష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. మరో ప్రస్థానం సినిమాకి తనీష్ యాక్టింగ్ హైలైట్ అనేలా ఉంటుంది అంటున్నారు మేకర్స్. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తనీష్ కి మరో విజయాన్ని అందించి.. మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు యంగ్ హీరో తనీష్.