ఘనంగా ‘మన్నించవా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నవంబర్ 25న చిత్రం విడుదల

221

రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆనేగౌని రమేష్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో మంజుల చవన్ నిర్మించిన చిత్రం ‘మన్నించవా’. మల్హోత్రా ఎస్ శివమ్, శంకర్, అనుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ బిగ్ సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శివ బాలాజీ, డైరెక్టర్ బాబ్జీ, నటులు ఖయ్యుమ్, జబర్ధస్త్ అప్పారావు, మానిక్ వంటి వారితో పాటు చిత్రయూనిట్ అంతా హాజరై.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఈ సందర్భంగా నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. జనగాం గ్రామానికి చెందిన మంజుల గారితో కలిసి రమేష్ గౌడ్‌గారు ఈ సినిమాను నిర్మించారు. ఇండస్ట్రీకి ఇది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను. దర్శకుడు రమేష్ గౌడ్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని భావిస్తున్నాను. అందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..’’ అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘‘చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్న మంజుల చవన్‌గారికి అభినందనలు. ఈ సినిమా గురించి విన్నాను. చాలా బాగా వచ్చిందని తెలిసింది. మంచి విజయం సాధించాలని కోరుతున్నాను. నవంబర్ 25న విడుదల కాబోతోన్న ఈ సినిమాకు మా తరపు నుండి అన్ని సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు.

చిత్ర నిర్మాత మంజుల చవన్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్‌ని అభినందించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అన్నీ తానై చూసుకుంటూ.. దర్శకుడు రమేష్ గౌడ్‌గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 25న గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

దర్శకుడు ఆనేగౌని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘పెద్దలు దామోదర ప్రసాద్‌గారికి, ప్రసన్నకుమార్ గారికి.. ఇంకా విచ్చేసిన అతిథులందరికీ మా టీమ్ తరపున ధన్యవాదాలు. విలేజ్ నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథ, విలువలు ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. నిర్మాత మంజుల చవల‌గారు మంచి సపోర్ట్ అందించారు. నవంబర్ 25న విడుదల చేయబోతున్నాం. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

మల్హోత్రా ఎస్ శివమ్, శంకర్, అనుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి
బ్యానర్స్: రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్
కొరియోగ్రఫీ: వన్2 ప్రసాద్ జామి
సంగీతం: జాన్ భూషణ్
ఎడిటింగ్: సెల్వన్
ఆర్ట్: విజయ్ కృష్ణ
పీఆర్వో: వీరబాబు
నిర్మాతలు: మంజుల చవన్, ఏ. రమేష్ గౌడ్
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, కెమెరా, దర్శకత్వం: ఆనేగౌని రమేష్ గౌడ్