సంక్రాంతి పండుగ సందర్బంగా హీరో మానస్, బిగ్ బాస్ ఫేం కీర్తి భట్, నిఖిల్ ల “సంక్రాంతి తకదై” సాంగ్ గ్రాండ్ లాంచ్ ..

155

ప్రతి ఏటా సంక్రాంతి పండుగ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే..జనవరి వచ్చిందంటే చాలు మెదటి వారం నుండే షాపింగ్ మాల్స్ కిటకిట లాడుతూ అందరికీ సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయినట్లు ఆనిపిస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, రేగి పళ్ళు, కొత్త అల్లుళ్ళు, బోగి మంటలు, గాలి పటాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది.ఈ సంబరాలకు సినిమాలు కూడా తోడవ్వడంతో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, మరో వైపు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న టైంలో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు రెడ్ సెడార్ ఎంటర్టైన్మెంట్ వారు ముందుకు వచ్చి పండుగ వాతావరణం ఉట్టి పడేలా “సంక్రాంతి తకదై” పాటను షోషల్ మీడియా ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. అనీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో శరద్ గుమస్తే నిర్మించిన “సంక్రాంతి తకదై” పాటకు అనూప్ మీనన్ అద్భుతమైన మ్యూజిక్ కంపొజిషన్ చేశారు. ఈ పాటకు మానస్ నాగులపల్లి, బిగ్ బాస్ ఫెమ్ కీర్తి భట్, నిఖిల్ లు నర్తించారు. అంతేకాకుండా ఈ పాటలో కన్నడ సూపర్ స్టార్ రమేష్ అరవింద్ స్పెషల్ అప్పీరెన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

తకదై.. తకదై తకదై…తకదై తకదై తకదై తకదై
దూరమున్న నింగిలో తార నేలకు జారిందా నేలకు జారిందా..
ఉత్తరాన చూడు సూర్యుడు నేలకు వంగిందా
తెలుగింట విరబూసె సంక్రాంతి సిరులేనా
అడవుల్లో మనసుల్లో ఉల్లాస వర్షాలే
పూలు తాకిన తేనెటీగల తోట మెరిసిందా..
భూమి తల్లికి చీరగ పచ్చని రంగును చెక్కారా..
పాటను అవినాష్ రావి నూతల రాయగా అనీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో అనూప్ మీనన్ అద్బుతంగా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను అనూప్ మీనన్, లక్ష్మి హేసల్ లు అద్బుతంగా ఆలపించారు.జై సరికొండ అందించిన ఈ పాటలో గంగిరెద్దు, ముగ్గులు, పచ్చని పొలాలు వంటి కెమెరా విజువల్స్ చూస్తుంటే ప్రేక్షకులకు సంక్రాంతి ముందే వచ్చిన ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తుంది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంటలలోనే ఈ పాటకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

నటీ నటులు
మానస్ నాగులపల్లి, హర్షిక పూంచ,రాధిక నారాయణ్, పృథ్వీ అంబార్,కీర్తి బట్, నిఖిల్,మలియక్కల్

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : రీడ్ సేడర్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : శరద్ గుమస్తే
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అన్వేష్ బాష్యం
కొరియోగ్రాఫీ, దర్శకత్వం : అనీ మాస్టర్
మ్యూజిక్ కంపోజర్ : అనూప్ మీనన్
డి. ఓ. పి : జై సరికొండ
లిరిక్స్ : అవినాష్ రావి నూతల
సింగర్స్ : అనూప్ మీనన్, లక్ష్మి హోసల్
ఎడిటర్ : ప్రభు
ప్రొడక్షన్ అసిస్టెంట్ : ప్రశాంత్, రాము
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్