ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతులమీదుగా విడుదలైన “మల్లె మొగ్గ” ట్రైలర్

451

కన్నా నాగరాజు సమర్పణలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ తేజ్, వర్షిని, మౌనిక హీరో,హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మల్లె మొగ్గ”. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో చిత్ర ట్రైలర్ మరియు ఆడియో విడుదల కార్యక్రమం సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వై.ఎస్.ఆర్. సి.పి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా,,ప్రముఖ దర్శకులు చంద్రమహేష్ , నిర్మాత తోట సుబ్బారావు,దర్శక, నిర్మాత దాచేపల్లి శ్రీనివాసులు లు చిత్ర ఆడియోని ఆవిష్కరించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో

ముఖ్య అతిథిగా వచ్చిన తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. “మల్లె మొగ్గ” టైటిల్ చాలా బాగుంది.ఈ సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి.చాలా సంవత్సరాలు గా మా తోట వెంకట నాగేశ్వరరావు ఇండస్ట్రీలో వుంటూ తను అనేక సినిమాలకు సహాయ దర్శకుడు పని చేశాడు. ఇప్పుడు తనే సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మల్లె మొగ్గ లాంటి మంచి కథతో మన ముందుకు వస్తున్న తోట వెంకట నాగేశ్వరరావును మనమందరం ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర సమర్పకులు కన్నా నాగరాజు మాట్లాడుతూ ..తోట నాగేశ్వరరావు గారు నాకు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది.కథ అంతా కూడా కొత్తదనంగా ఉంటుంది.తను ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాడు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసి మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ..మా కజిన్ తోట త్రిమూర్తులు గారు రాజకీయంగా ఎంతో బిజీగా వున్నా కూడా వచ్చి మా ట్రైలర్ ను విడుదల చేశారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే దర్శకులు చంద్ర మహేష్, దాచేపల్లి శ్రీనివాస్, నటులు ప్రసన్న మరియు నా శ్రేయోభిలాషులు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు వారందరికీ మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.నేను కోడి రామకృష్ణ గారు, కృష్ణవంశీ గారు ఇలా సుమారు 26 మంది డైరెక్టర్లు దగ్గర వర్క్ చేశాను.అలాగే భాను చందర్ గారు నటించిన ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా పని చేశాను.మరియు 16 మెగా సీరియల్స్ కు డైరెక్టర్ గా వర్క్ చేశాను. భానుచందర్ గారు ఎందుకు నీకున్న టాలెంట్ ను టైం వేస్ట్ చేస్తున్నావ్ అని చెప్పడంతో మంచి కథ రాసుకొని ఈ సినిమా చేస్తున్నాను.ఈ సినిమా కొరకు నా భార్యకు వచ్చిన ఇంటిని అమ్మి ఈ సినిమా చేస్తున్నాను.తనెంతో నాకు సపోర్ట్ గా నిలవడంతో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఇది ఫుల్ సెంటిమెంట్ మూవీ కమర్షియల్ గా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ఖచ్చితంగా నంది అవార్డుకు సెలెక్ట్ అయ్యే కథ, ఇందులో భాను చందర్ గారు మంచి క్యారెక్టర్ చేశారు.ఇందులోని పాటలు హైలెట్ గా నిలుస్తాయి. నటీనటులు,టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత తోట నాగేశ్వరరావు గారు ..మంచి టైటిల్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిట్ అయి తను మరెన్నో సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

నటుడు కోట శంకర్ రావు మాట్లాడుతూ.. దర్శకుడు నాగేశ్వరరావు గత 15 సంవత్సరాలుగా తెలుసు. తను ఎంత కష్టపడతాడో నేను దగ్గరుండి చూసాను.మంచి కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో అర్జున్ తేజ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం ఈ సినిమాను చాలా కష్టపడి ఎంతో ఇష్టంతో చేశాము. సినిమా అవుట్ ఫుట్ కూడా చాలాబాగా వచ్చింది. ఈ సినిమాను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి చూసే సినిమా ఇది .ఈ సినిమాను చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఎక్కడ కూడా యాక్టింగ్ నేర్చుకోలేదు. కానీ ఇందులో నేను చేసిన డ్యాన్స్ చూసి మీరే ప్రశంసిస్తారు .మా తాతగారు రాసిన లిరిక్స్ కు నేను డ్యాన్స్ చేయడం అది కూడా మా మామయ్య డైరెక్షన్ లో నేను నటించడం అనేది నాకు వంద సినిమాలు చేసిన దాంతో సమానంగా భావిస్తున్నాను. ఇది నేను హాట్ ఫుల్ గా చెబుతున్నాను. త్వరలో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

హీరోయిన్ మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

నటీనటులు
అర్జున్ తేజ్ ,వర్షిని, మౌనిక ,భానుచందర్,ప్రసాద్ బాబు, కోట శంకర్ రావు, పిల్ల ప్రసాద్, దేవిశ్రీ, చత్రపతి శేఖర్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : కన్నా నాగరాజు ప్రెజెంట్స్
బ్యానర్ : హెచ్ ఆర్ ప్రొడక్షన్స్
చిత్రం : మల్లె మొగ్గ
స్టోరీ, స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్టర్ : తోట వెంకట నాగేశ్వరరావు
డి ఓ.పి : దండపాణి
మ్యూజిక్ డైరెక్టర్ : ఏ ఆర్ సన్నీ, సత్య సోమేష్
ఎడిటర్ : వంశీ నెల్లూరు
డైలాగ్స్ : ముక్క వరలక్ష్మి
ఆర్ట్ డైరెక్టర్ : కుమార్
కొరియోగ్రఫీ :;జోజో
ఫైట్స్ : యాక్షన్ అహ్మద్ , రవి
పి ఆర్.ఓ : వీరబాబు


Veerababu PRO
9396410101