పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘మద్రాసి గ్యాంగ్’’ అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి. ఈ సందర్భంగా
నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ: మా బ్యానర్ లో ఇంతకు ముందు మంచు మనోజ్ తో ‘‘ఒక్కడు మిగిలాడు’’ మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది.హిందీ,తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్ గా సంజోష్,రంగ జిను నటిస్తున్నారు. హీరో మంచు మనోజ్ గారు వచ్చి కెమెరా స్విచ్చాన్ చేసి, విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్థతలు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్ ను లాంచ్ చేశారు.అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు.వాళ్లందరికీ థాంక్స్.’’ అన్నారు.
నటీనటులు: సంజోష్, రంగ జిను, తదితరులు.
టెక్నీషియన్స్:
సినిమాటోగ్రఫీ: వి.కె రామరాజు
మ్యూజిక్: ఎన్.ఎస్ ప్రసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : శివ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్స్: ధరణి కుమార్,రాధాకృష్ణ తాతినేని
నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి
రచన,దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతంకి.