మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి మూవీ గ్రాండ్ రిలీజ్

84

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 25న ట్రైలర్ ని మార్చ్ 1న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు రజిత మరియు సునీత మాట్లాడుతూ : ఎంతో ఇష్టంతో చాలా కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం. మంచి మంచి లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం. ప్రేక్షకుల ఆశీస్సులు ఆదరణ మాపై ఈ సినిమాపై ఉండాలని ఈ సినిమా మన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు.

దర్శకుడు రవి బాసర మాట్లాడుతూ : మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించాం. బోరిగామా విలేజ్, గోపాల్ పేట్ తండా, గండి రామన్న దేవస్థానం, కడం హరితహారం ప్రాజెక్టు మరియు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. మంచి లొకేషన్స్ లో ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. ఈనెల 25న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్

టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఆర్ ఎస్ మూవీ మేకర్స్
నిర్మాతలు : రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత
డి ఓ పి : వాసు
మ్యూజిక్ : పీకే
సింగర్ దివ్య మాళిక
ఎడిటర్ : అలోషియస్ – నరేష్
ఆర్ట్ : రవీందర్. పి
డైలాగ్స్ : కే. నరసయ్య చారి
డైరెక్టర్ : రవి బాసర
పి ఆర్ ఓ : మధు VR