షూటింగ్ లొకేషన్ లో బిగ్ బాస్ అమర్ దీప్ కు సన్మానం

96


ఎమ్ 3 (M3) మీడియా మరియు మహా మూవీస్ పతాకంపై మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి మరియు సుప్రియ సురేఖావాణి హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే స్టార్ మా లో నిర్వహించిన నీతోనే డాన్స్ షో లో అమర్ దీప్ చౌదరి మరియు తన భార్య తేజు విజేతగా నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ షూటింగ్ మధ్యలో కేక్ ని కట్ చేసి హీరో అమర్ డీప్ ని సన్మానించారు.

ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ “నేను స్టార్ మా లో నిర్వహించిన నీతోనే డాన్స్ షో లో నేను నా భార్య విజేతగా నిలవటం చాలా సంతోషంగా ఉంది. నన్ను గెలిపించిన తెలుగు ప్రేక్షకులకి మరియు స్టార్ మా కి నా కృతజ్ఞతలు. మా సినిమా షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను” అని తెలిపారు

ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల , డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత తదితరులు లు పాల్గొన్నారు.