వంబర్ 9న ప్రేక్షకుల ముందుకు “మా ఊరి సినిమా “

187


శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో జి. మంజునాధ్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “మా ఊరి సిన్మా”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న ప్రసాద్ లాబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్, తదితరులు పాల్గొని సినిమా బాగుందని ప్ర శoసించారు.

ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ ” మా ఈ కార్యక్రమానికి పులివెందుల నుంచి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరి సినిమా బాగుందని , సిన్మా చూసిన పెద్దలు అభినందిస్తూ వుంటే ఆనందం గా వుంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలుపుకంటున్నాను . అని అన్నారు.

చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ” మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.”అన్నారు.

హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ” మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం వుంది. బావ మరదళ్ల ఆప్యాయత వుంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో వున్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను “అని అన్నారు.

పులివెందుల మహేష్, ప్రియపాల్, మైఖేల్ సిద్దు (విలన్)మంజు నాథ్ రెడ్డి, మహేష్ విట్టా, ముఖేష్ , అనంత లక్ష్మి, రమణి, కృష్ణ మోహన్, నేహరెడ్డి, నవనీత్ హరి తదితరులు నటించిన

ఈ చిత్రానికి; కెమెరా: దర్మా ప్రభ, సంగీతం: ఎస్.కె.బాజీ, కలరిస్ట్: రత్నాకర్ రెడ్డి లిరిక్స్ : రాంబాబు గోసాల ఆడియో గ్రఫి: శ్రీ మిత్ర, సింగర్స్: ఉష, ఇంద్రావతి చౌహాన్,మూల కథ: పులివెందుల మహేష్ నిర్మాత: జి. మంజునాథ్ రెడ్డి డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివరాం తేజ.