నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ ముగుస్తోంది. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ “లవ్ స్టోరి” టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా
సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ…మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. “లవ్ స్టోరి” పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్. అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, తను అనుకున్న కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కిస్తాడు. శేఖర్ కమ్ముల సినిమాను నేనెంతో అభిమానిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. పవన్ మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దరియా సాంగ్ కోసమైనా “లవ్ స్టోరి” సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా. అన్నారు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ…నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…నాగ చైతన్య, సాయి పల్లవి జంట లవ్ స్టోరి చిత్రంలో బాగుంది. వాళ్లద్దరూ బాగా నటించాలని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. పాండమిక్ టైమ్ లో సినిమాలు రిలీజ్ చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. థియేటర్ లోనే తమ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చిన నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ గారికి అభినందనలు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టార్లలో పుంజుకోవాలి. లవ్ స్టోరి చిత్రంతో థియేటర్ లలో సినిమా చూసే ఉత్సాహం రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ….మా లవ్ స్టోరి ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన మా సినిమా గురించి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయనకు మా టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక అమీర్ ఖాన్ ను అభిమానించే వాళ్లలో నేనూ ఒకర్ని. ఆయన సినిమా ఖయామత్ తే ఖయామత్ తక్ చూసినప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ ఇలా గన్ పట్టుకుని డిఫరెంట్ సినిమా ఎలా చేయగలిగాడు అని ఆశ్చర్యపోయాను. నేను డాలర్ డ్రీమ్స్ సినిమా చేసి, దానికి నేషనల్ అవార్డ్ పొందాను. ఆ తర్వాత దిల్ చాహతా హై రిలీజైంది. అక్కడా యువత డ్రీమ్స్ కనిపిస్తాయి. సినిమాలకు ఏదో ఒక పర్పస్ ఉండాలని కోరుకుంటాను. సొసైటీకి ఏదో ఒక మంచి చెప్పాలనుకుంటాను. లీడర్ సినిమాలో నేనో డైలాగ్ రాశాను. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని. ఆ డైలాగ్ నుంచి ఇన్ స్పైర్ అయి లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించాను. లవ్ స్టోరి షూటింగ్ టైమ్ లో ఫస్ట్ వేవ్, రిలీజ్ టైమ్ లో సెకండ్ వేవ్ వచ్చాయి. ఈ కష్టంలోనూ మా సినిమా టీమ్ అంతా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. వాళ్లందరికీ నా థాంక్స్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నారాయణదాస్ నారంగ్ గారికి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ…చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు. అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు. ఆయన ఆ మాట అనగానే నమ్మలేకపోయాను. 45 రోజులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం అమీర్ ఖాన్ గారితో పనిచేశాను. ఆ టైమ్ లో నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. 24న థియేటర్ లో చూస్తారు. ఇలాంటి సినిమాలో నటించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సెన్సిటివ్ ఇష్యూను గురించి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. మా దర్శకుడికి ఆ ధైర్యం ఉంది. ఏడాది ఏడాదిన్నరగా సినిమాను హోల్డ్ చేసిన నిర్మాతలకు థాంక్స్. మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. 24న మా సినిమా విడుదల అవుతోంది. ఇదో మ్యాజిక్ డేట్ లా అనిపిస్తోంది. తాతగారి ప్రేమనగర్ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. మిమ్మల్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అన్నారు.