యమదొంగ, చింతకాయల రవి, కింగ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ మమతామోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “లాల్ బాగ్”. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా…
సమర్పకులు ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ – ”థ్రిల్లర్ జోనర్ లో ఒక విభిన్న కథా చిత్రంగా లాల్ బాగ్ సినిమా రూపొందింది. మమతామోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ మురళి పద్మానాభన్ అధ్బుతంగా తెరకెక్కించారు. ఈ నవంబరు 26న తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది” అన్నారు.
తారాగణం: మమతామోహన్ దాస్, నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి
సాంకేతిక వర్గం
దర్శకత్వం : ప్రశాంత్ మురళి పద్మానాభన్
సమర్పణ: ఏ. సంపత్ కుమార్
బ్యానర్: సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్
డీ ఓ పి: అంథోని రాజ్
సంగీతం: రాహుల్ రాజ్
ఎడిటర్: సునీష్ సెబాస్టియన్
ఆర్ట్: రాజేష్ శంకర్
పి ఆర్ ఓ: శ్రీను – సిద్దు