తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. ‘రావణలంక’ ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు..

226

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు రావణలంక యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

రావణ లంక సినిమా గురించి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలను ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడు ఆడియన్స్ వదులుకోరు. ఇప్పుడు రావణ లంక సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే నమ్మకం నాకు ఉంది’ అని తెలిపారు.

న‌టీన‌ట‌లు – క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌ర‌లు

బ్యాన‌ర్ – కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్ట‌రీ
నిర్మాత – క్రిష్ బండిపల్లి
మ్యూజిక్ – ఉజ్జ‌ల్
సినిమాటోగ్రఫి – హ‌జ‌ర‌త్ షేక్ (వ‌లి)
ఎడిటర్ – వినోద్ అద్వ‌య్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
కో డైరెక్ట‌ర్ – ప్ర‌సాద్
డైరెక్ట‌ర్ – బిఎన్ఎస్ రాజు

Eluru Sreenu
P.R.O