కౌశల్ మందా నటించిన ‘రైట్’ చిత్రం డిసెంబర్ 30 న విడుదల

214

మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మందా మరియు లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వం లో లుకలాపు మధు మరియు మహంకాళి దివాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్”. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రం రీమేక్ ఇది. అయితే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 30న విడుదల కు సిద్ధంగా ఉంది.

హీరో కౌశల్ మందా మాట్లాడుతూ “బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఈ చిత్రం చేశాను. ఈ చిత్రం జీతూ జోసెఫ్ గారి మెమోరీస్ చిత్రం రీమేక్ ఇది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మీరు అందరు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. డిసెంబర్ 30న విడుదల కు సిద్ధంగా ఉంది. అలాగే నా రైట్ చిత్రాన్ని చూసి నన్ను బ్లెస్స్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు లూకాలపు మధు గారికి మరియు దివాకర్ గారికి ధన్యవాదాలు. 40 ఏళ్ల గా ప్రతి క్రాఫ్ట్ లో ఎంతో అనుభవం ఉన్న శంకర్ గారు ఈ చిత్రం దర్శకత్వం వహిస్తున్నారు. మన నిర్మాత దివాకర్ గారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ తరపున లక్షల మందికి సహాయం చేశారు. నాకు చారిటీ అంటే ఇష్టం. దివాకర్ గారి ప్రతి మంచి పనికి నేను తోడుగా ఉంటాను. టాప్ టెక్నిషన్స్ ఈ చిత్రానికి వర్క్ చేసారు” అని తెలిపారు.

నిర్మాత మధు మాట్లాడుతూ “మేము అనుకున్నట్లుగా సినిమా వచ్చింది, కౌశల్ ఆర్మీ కి, సాధారణ ప్రేక్షకులకు సైతం సినిమా బాగా నచ్చుతుంది. డిసెంబర్ 30 న సినిమా ని విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ “మంచి కమర్షియల్ సినిమా ఇది, కౌశల్ మందా కి పక్కా హిట్ పడుతుంది, దీపావళి రాకెట్ లా ఖచ్చితంగా మా సినిమా దూసుకుపోతుంది అని నమ్ముతున్నాం” అని అన్నారు.

చిత్రం పేరు : రైట్ (Right)

బ్యానర్ : మణి దీప్ ఎంటర్టైన్మెంట్

నటి నటులు : కౌశల్ మందా, లీషా ఎక్లైర్స్, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ , తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల

కెమెరా మాన్ : ఈ వి వి ప్రసాద్

ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్

ఎడిటర్ : తిరుపతి రెడ్డి

పి ఆర్ ఓ : పాల్ పవన్

కో – డైరెక్టర్ : రఘు వర్ధన్, భిక్షు

డైరెక్టర్ : శంకర్

నిర్మాతలు : లుకలాపు మధు మరియు మహంకాళి దివాకర్


Pavan Kumar

9849128215

Film Reporter