కథానిక చిత్రం ఏప్రిల్ 23న విడుదల

941

థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం “కథానిక”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా కథ, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన జగదీష్ దుగన మాట్లాడుతూ “కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనం తో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. మా చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాము. తప్పక చుడండి” అని తెలిపారు.

నిర్మాత శ్రీమతి పద్మ లెంక మాట్లాడుతూ “కథానిక చిత్రానికి ఎంతో ప్యాషన్ తో నిర్మించాము. డైరెక్టర్ గారు చూపిన కథ బాగా నచ్చింది. ఎక్కడ కంప్రమైస్ కాకుండా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం, కథ కథనం మా చిత్రం లో హైలైట్ గా నిలిచాయి. ఏప్రిల్ 23న రెండు తెలుగు రాష్ట్రలో విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.

బ్యానర్ : థాంక్యూ ఇంఫ్రా టాకీస్

సినిమా పేరు : కథానిక

నటి నటులు : మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, బొంబాయి పద్మ, కేర్ అఫ్ కంచరపాలెం ఫేమ్ ఉమా మహేశ్వర రావు, అల్లు రమేష్, నల్లా సీను, బేబీ సంజన, కార్తిక్, తదితరులు

కెమెరా మాన్ : హరినాథ్ దేవర

ప్రోగ్రామింగ్ & బి జి యం : తరుణ్ రానా ప్రతాప్

గాయకులు : శ్రీ కృష్ణ, కారుణ్య, దీపు, సురేష్, పావని, జగదీష్ దుగన

సౌండ్ ఇంజినీర్ : వినయ్ కుమార్

ఎడిటర్ : కె యాదగిరి

టైటిల్ & డిజైన్ : అర్ ఫిలిం ఎడిటింగ్

క్రియేటివ్ హెడ్ : మణికంఠ దుగన

పబ్లిసిటీ : ఏం కె ఎస్ మనోజ్

ఆర్ట్ : సతీష్ మరియు పురుషోత్తం

కో డైరెక్టర్ : నిధి బంటుపల్లి

కో ప్రొడ్యూసర్ : రామ రావు లెంక

ప్రొడ్యూసర్ : శ్రీమతి పద్మ లెంక

పోస్ట్ ప్రొడక్షన్ : డ్రీమ్ స్టూడియోస్

స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్, మాటలు, దర్శకత్వం : జగదీష్ దుగన