కిట కిట లాడించడానికి డిసెంబర్ 10 న థియేటర్స్ లోకి వస్తున్న కఠారి కృష్ణ
Maa ప్రెసిడెంట్ మరియు హీరో మంచు విష్ణు గారు ” కఠారి కృష్ణ ” పోస్టర్ విడుదల చేసారు బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. అన్నీ you tube channels లో 2 మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా… ఇండస్ట్రీ లెజండరి పర్సన్ నటులు మరియు జయభేరి అధినేత మురళి మోహన్ గారితో కఠారి కృష్ణ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.. తనికెళ్ళ భరణి గారితో ఒక సాంగ్, గౌతమ్ రాజు గారితో మరొక సాంగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ తో sneak peak వీడియో నీ రిలీజ్ చేయడం జరిగింది ట్రైలర్ సునాయాసంగా అన్నీ you tube చానెల్స్ లో కలిపి పది మిలియన్ వ్యూస్ దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి ఈ చిత్రానికి ఇప్పటికే గల క్రేజును మరింత పెంచుతోంది.
“కఠారి కృష్ణ ” ట్రైలర్ కు లభిస్తున్న స్పందన చిత్ర విజయంపై తమకు గల నమ్మకాన్ని మరింత పెంచుతోందని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ… నటులు మురళి మెహన్ గారికి, మంచు విష్ణు గారికి, తనికెళ్ళ భరణి గారికి, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. “కఠారి కృష్ణ ” చిత్రాన్ని వచ్చే నెల డిసెంబర్ 10 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
సీనియర్ నటులు గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ హీరోగా , చాణక్య, రేఖా నిరోషా, యష్నా చౌదరి, స్వాతి మండల్, పోసాని కృష్ణ మురళి, TNR , మిర్చి మాధవి, D S RAO చంద్రశేఖర్ తిరుమలశెట్టి, మధుబాబు, మహేష్ నందా, ప్రధాన పాత్రదారులుగా ‘నూతన యువ దర్శకులు ప్రకాష్ తిరుమలశెట్టి నీ పరిచయం చేస్తూ నాగరాజు తిరుమలశెట్టి, P A నాయుడు నిర్మించిన ‘కఠారి కృష్ణ చిత్రానికి “క్లీన్ U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.
ఈ చిత్రానికి చీఫ్ కో -డైరెక్టర్ : బండ రమేష్, కో-డైరెక్టర్స్ : వీరేంద్ర గోభిదేశీ , శ్రీనివాసరావు బొడ్లపాటి. పాటలు: మాచెంద్ర , దొరబాబు. సంగీతం: పద్మనాభవ్ భరద్వాజ్, ఎడిటింగ్: ఆలోషియస్ , కెమెరా: ఆర్య, మనీష్ దివాన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : హరీష్ కాచిరాజు మాటలు : శివమణి పి.ఆర్.ఓ: వాసు సజ్జా , నిర్మాతలు : నాగరాజు తిరుమలశెట్టి & P A నాయుడు రచన-దర్శకత్వం: ప్రకాష్ తిరుమలశెట్టి
కధ కధనం దర్శకత్వం : ప్రకాష్ తిరుమల శెట్టి
Pro : Vasu Sajja
9391106346