ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదలైంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ లో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్టర్ రూపంలో దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తికేయ 2.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్యం – చందు మెుండేటి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్లనిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్