మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసే హీరో అవ్వాలనుకున్నాను – 90ml ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ

680

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ. ఇక ఇప్పుడు సరికొత్త కిక్ ఇవ్వడానికి మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 90ML. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా శనివారం చిత్ర‌ యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు.
వేడుకలో సినీ ప్రముఖులు సందీప్ కిషన్, జానీ మాస్టర్, రోల్ రిడా, తాగుబోతు రమేష్, విఠల్ రెడ్డి, రజిని, వంటి ప్రముఖులు పాల్గొన్నారు.. డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నేను మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది డైరెక్టర్ అజయ్ బూపతి గారికి. ఆయన ద్వారానే కార్తికేయ లాంటి మంచి హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆయన సాయంతోనే ఈ సినిమా కథ వినిపించాను. అందుకు ఆయనకు స్పెషల్ గా కృతజ్ఞతలు చేసుబుతున్నా. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ సాంగ్స్ తీజర్స్, ట్రైలర్ కూడా అన్ని మీకు నచ్చాయి. అలాగే డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడ్డారు. అనూప్ రూబెన్స్ గారు చాలా తక్కువ సమయంలో మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఎడిటర్ శేఖర్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. సినిమాలో నటించిన నటీనటుల గురించి చాలా మాట్లాడాలని ఉంది సినిమా రిలీజ్ తరువాత వారి గురించి మాట్లాడుతా.. హీరోయిన్ నేహా సినిమాలో చాలా బాగా నటించింది. ఇక కథ వినగానే సినిమా ఒప్పుకొని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా ఉన్న హీరో కార్తికేయ.. అంటూ దర్శకుడు మాట్లాడారు.