సెప్టెంబర్ లో విడుదల కానున్న కార్తీ, పా రంజిత్, KE జ్ఞానవేల్ రాజా బ్లాక్ బస్టర్ ‘మద్రాస్’..

367

కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన మద్రాస్ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేయబోతున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. KE జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ప్రశంసలే కాదు పాటు కమర్షియల్ గానూ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ లో మద్రాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వీలైనంత త్వరగా దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

నటీనటులు:
కార్తీ, కలైరసన్ హరికృష్ణన్, కేథరిన్ త్రేసా, రిత్విక తదితరులు

టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పా రంజిత్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జైసన్ అభిషేక్
రైటర్ : భారతి బాబు
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్