హీరో కార్తి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్2న విడుదలవుతున్న తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది ఈ కార్యక్రమంలో..
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న వరంగల్ శ్రీను మాట్లాడుతూ – “ముందుగా నేషనల్ అవార్డు సాధించిన సందర్భంగా ఇక్కడి వచ్చిన వంశీపైడిపల్లిగారికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్. కొన్ని ప్రొడక్షన్స్ మాత్రమే తమ బ్రాండ్ వ్యాల్యూస్ కలిగిఉంటుంది. అందులో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఒకటి. ఖాకీ, ఖైది లాంటి సినిమాలే దానికి ఉదాహరణ. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు గారు కాన్సెప్ట్ ఓరియంటెట్ మూవీస్ మాత్రమే నిర్మిస్తారు. ఆన్ స్క్రీన్‌మీద కార్తి చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేస్తారు. మన ప్రక్కింటి అబ్బాయి అనేలా ఉంటారు. రష్మిక సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ట్రైలర్ చూస్తే మార్చి లెక్కలు అన్ని అయిపోయాయి. ఇక బాక్సాఫీస్ లెక్కల్ని తేలుస్తుంది అనిపించింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ – “మీ అందరినీ కలిసి చాలా రోజులైంది. తమిళ్ ఇండస్ట్రీలో ఇది నా డెబ్యూ ఫిలిం. కొంచెం నర్వస్‌గా, అలాగే ఎగ్జయిటింగ్‌గా కూడా ఉంది. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు చాలా బాగా చూసుకున్నారు. ఏప్రిల్2న సినిమా చూసి ఎంజాయ్ చేయడం“ అన్నారు.
దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ మాట్లాడుతూ – “ నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. చాలా మంది తెలుగు హీరోలకి నేను అభిమానిని కూడా..ఇదొక మాస్ ఎంటర్టైనర్. తప్పకుండా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్ 2న రిలీజవుతున్న సుల్తాన్ సినిమాని అందరూ థియేటర్లోనే చూడండి. ఈ అవకాశం ఇచ్చిన కార్తి, ప్రభుగారికి థ్యాంక్స్“ అన్నారు.
డ్రీమ్ వారియర్ పిక్టర్స్ అధినేత ఎస్ ఆర్ ప్రభు మాట్లాడుతూ – “తెలుగు రాష్ట్రాల్లో ఎమోషన్ సెట్ అయ్యింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. మరో మంచి సినిమా ఇచ్చిన కార్తి గారికి థ్యాంక్స్. సత్యన్ సూర్యన్‌తో ఇది నాలుగవ చిత్రం. ఆ సక్సెస్ లు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ = “తమిళనాడుతో ఎలక్షన్స్ కాబట్టి ఏప్రిల్2న రాబోతున్నాం. మా కష్టాన్ని అర్ధం చేసుకుని మా సినిమా కూడా బాగా ఆడాలని విష్ చేసిన మా అన్నయ్య నాగార్జున గారికి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఒక అన్నయ్య ఏం చేయాలో అదే చేశారు. నాగ్‌సర్ ఐలవ్యూ..ఒక తమ్ముడుగా మా అన్నయ్య వైల్డ్‌డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. నాగార్జునగారిలా మళ్లీ మళ్లీ డిఫరెంట్ సినిమాలు తీసుకురావడం చాలా కష్టం. ఆయన ఫస్ట్ నుండి చేస్తున్నారు. నాకు నాగార్జునగారు పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఊపిరి చేసింది ఆయన్ని కలవచ్చు అనే..వంశీగారు మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. ఆయన ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. రష్మిక చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా బాగా చేసింది. సినిమా చూశాను చాలా నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. వరంగల్ శ్రీను కంటిన్యూయస్‌గా సక్సెస్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సినిమా కూడా అతనికి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్2న మా అన్నయ్య సినిమా వైల్డ్‌డాగ్ చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి“ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీధర్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, నటుడు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.