…పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న మద్రాస్ బస్టాండ్

762

లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్ మరియు శ్రీ నందనం ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో, సాయి జేమ్స్, రేణుప్రియ హిరో హీరోయిన్ గా, జనార్ధన్ శివలంకి డైరెక్షన్ లో మొచర్ల శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా మద్రాస్ బస్టాండ్

షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మోచర్ల శ్రీను మాట్లాడుతూ: మద్రాస్ బస్టాండ్ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ జనార్ధన్ మాకు స్టొరీ ఏదైతే చెప్పాడో అదే విధంగా సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమా కచ్చితంగా మా బ్యానర్ కి మంచి పేరు తెస్తుంది.మా మొదటి ప్రయత్నాన్ని ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది అన్నారు. దర్శకుడు జనార్ధన్ శివలంకి మాట్లాడుతూ: మద్రాస్ బస్టాండ్ సినిమా విభిన్న మైన ప్రేమ కదా చిత్రం. మాస్ ఎలిమెంట్స్ తో సెంటిమెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ గా వుంటుంది సినిమా బాగా వచ్చింది.నటి నటులందరూ బాగా నటించారు . టెక్నీషియన్స్ కూడా సినిమా బాగా రావడానికి ఎంతో కష్ట పడ్డారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.త్వరలో ఆడియో ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు.

హీరో:- సాయి జేమ్స్ ,హీరోయిన్:-రేణు ప్రియ
ముఖ్య పాత్రల్లో-మురళి కృష్ణ రెడ్డి, రాజ్ కుమార్, శాంతి కుమార్ (జబర్దస్త్ ),బాబు పోకల, నెల్లూరు శ్రీను, జయచంద్ర,ఆయేషా తదితరులు నటించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ : నాగేoద్ర బన్నీ మ్యూజిక్ డైరెక్టర్ :- రాంప్రసాద్ రేవూరి
ఎడిటింగ్ :- బాబు పోకల
లిరిక్స్ :- మహేశ్వరావు నాయుడు రాధయ్య మాముడూరు
కోప్రొడ్యూసర్స్ :- భాస్కర భారతి దేవి, రఘు మన్నే పల్లి, మోచర్ల శ్రీను, A.O& ప్రొడక్షన్ కంట్రోలర్ :- Sk. షంషుద్దీన్
ప్రొడ్యూసర్ :- మోచర్ల శ్రీను
రైటర్ & డైరెక్టర్ :- జనార్దన్ శివలoకి  

PRO; SATISH