సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `కనబడుటలేదు`. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 13న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్ టిక్కెట్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…
పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “కనపడుట లేదు అనే టైటిల్ నన్నెంతగానో ఇన్‌స్పైర్ చేసింది“ అన్నారు.
సుక్రాంత్ మాట్లాడుతూ “డైరెక్టర్ బాలరాజుగారితో ఐదేళ్ల నుంచి జర్నీ చేస్తున్నాను. దాని కారణంగానే ఈరోజు స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో అండగా నిలబడిన మా మ్యూజిక్ డైరెక్టర్ మధు పొన్నాస్‌గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. కంటెంట్ బావుంటే సినిమాను ఎలా ఆదరిస్తారో మాకు తెలుసు. ఆగస్ట్ 13న మీ ముందుకు రాబోతున్నాం. కచ్చితంగా సినిమాను పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాం.. అందరికీ థాంక్స్“ అన్నారు.
హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ “సినిమాలో నటించడం అనేది నా డ్రీమ్. చాలా ఎమోషనల్‌గా, నెర్వస్‌గా ఉంది. మాటలు రావటం లేదు. ఆగస్ట్ 13న థియేటర్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. మా కనబడుటలేదు యూనిట్‌ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం“ అన్నారు.
డైరెక్టర్ బాలరాజు ఎం మాట్లాడుతూ “నాకు సినిమాలంటే పిచ్చి ఏర్పడటానికి కారణం రామ్‌గోపాల్ వర్మగారు. ఆయన సినిమాలు చూసి సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఇంటర్నేషనల్ మేకింగ్‌ను, సౌండింగ్‌ను మన సినిమాలకు పరిచయం చేసిన తొలి దర్శకుడాయన. అలాగే మన సినిమాలను ఇంటర్నేషనల్ స్థాయికి కథల రూపంలో పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్‌గారే. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తేనే సక్సెస్ ఏమో అనుకున్నాను. కానీ.. ఓ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా తీస్తేనే సక్సెస్ అని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఈ సినిమాకు తుది మెరుగులు దిద్ది ఇక్కడకు తీసుకొచ్చిన స్పార్క్ సీఇఓ సాగర్‌గారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. నా నిర్మాతలు రాజుగారు, కిషన్‌గారు, దేవీగారు, తలశిల, దిలీప్‌గారు.. ఇలా అందరికీ థాంక్స్. నన్ను భరించి, ప్రేమించి నాతో నడిచిన నా టీమ్‌కు థాంక్స్. థియేటర్స్‌లో ఈ ఆగస్ట్ 13న విడుదలవుతున్న కనబడుటలేదు సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
కో ప్రొడ్యూసర్ రాజు మాట్లాడుతూ “కిషనన్న, సుధీర్ తలశిల గారి వల్లే ఈ సినిమా మొదలైంది. మధ్యలో మేం ఎంటైర్ అయ్యి పూర్తి చేస్తే, సాగర్‌గారు మరో లెవల్‌కు తీసుకెళ్లారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఆగస్ట్ 13న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ జర్నీలో మాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మధు పొన్నాస్ మాట్లాడుతూ “నా మ్యూజిక్‌ను నాకంటే డైరెక్టర్ బాలరాజుగారే ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటారు. మంచి టీమ్‌తో పనిచేసినందుకు హ్యాపీగా ఉంది“ అన్నారు.
స్పార్క్ ఓటీటీ అధినేత, నిర్మాత సాగర్ మంచనూరు మాట్లాడుతూ “మా కార్యక్రమానికి వచ్చిన విజయేంద్రప్రసాద్‌గారికి, రామ్‌గోపాల్ వర్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. `కనబడుటలేదు` నాకు చాలా స్పెషల్. మా స్పార్క్‌లో ఫస్ట్ రిలీజైన మూవీ వర్మగారు చేసిన `డి కంపెనీ`..అయితే నేను ఫస్ట్ సైన్ చేసిన మూవీ `కనబడుటలేదు`. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం. ఆగస్ట్ 13న థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుంది. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “`కనబడుటలేదు` చాలా బాగా కనబడుతుంది. కొత్త దర్శకుడిలా బాలరాజు కనపడటం లేదు. తనెందుకు ఈ టైటిల్ పెట్టాడనేది సినిమా చూడాల్సిందే. స్పార్క్ సాగర్‌లాంటి నిర్మాత దొరకడం ఈ టీమ్‌కు అదృష్టం. ఎందుకంటే తను ఓసారి కమిట్‌మెంట్ ఇస్తే.. తర్వాత తన మాట తను కూడా వినడు. వైశాలిరాజ్ చాలా మంచి నటి. తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సుక్రాంత్ బాగా యాక్ట్ చేశాడు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు
నటీనటులు:
సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్, హిమజ, యుగ్రం, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమా మహేశ్వర రావు, కిషోర్, శ్యామ్ మరియు మధు
సాంకేతిక వర్గం:
రచన,దర్శకత్వం: బాలరాజు ఎం.
నిర్మాతలు: సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ
బ్యానర్స్: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
సమర్పణ: సరయు తలసిల
సంగీతం: మధు పొన్నాస్
డిఒపి: సందీప్ బద్దుల
ఎడిటింగ్: రవితేజ కుర్మాన
పిఆర్ఓ: వంశీ – శేఖర్