మోనిష్ ప‌త్తిపాటి నిర్మాత‌గా క‌ళ్యాణ్‌ దేవ్ హీరోగా MP ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ప్రారంభం..

862

 

      తుల‌సివ‌నం లో శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి స‌న్నిధిలో ‘విజేత’ లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా.. క‌థ కంచికి మ‌నం ఇంటికి లాంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని నిర్మించిన ఎం పి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి నిర్మాత‌గా, ద‌త్తి సురేష్ బాబు క్రియెటివ్ ప్రోడ్యూస‌ర్ గా ఎం కుమార‌స్వామి నాయిడు ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న చిత్రం ఈరోజు కూక‌ట్‌ప‌ల్లి లోని తుల‌సివ‌నం లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి టెంపుల్ లో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. YS కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: కళ్యాణ్ దేవ్

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: M కుమారస్వామి నాయుడు
బ్యానర్: MP ఆర్ట్స్
నిర్మాత: మోనిష్ పత్తిపాటి
క్రియేటివ్ ప్రొడక్షన్స్: దత్తి సురేష్ బాబు
నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుభాష్ దేవబత్తిని
DOP : YS కృష్ణ
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్