డైరెక్టర్ సృజన గుండె లోతుల్లో నుంచి పుట్టినదే ఈ గమనం -శ్రియ శరన్

360

క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీయ శరన్, ప్రియాంక జవకర్, సాయి మాధవ్ బుర్ర గారు, డైరెక్టర్ సుజనా గారు,ప్రొడ్యూసర్ బాబా గారు “గమనం “మూవీ విశేషాలు మనతో పంచుకున్నారు.

సాయిమాధవ్ బుర్ర గారు మాట్లాడుతూ గమనం సినిమా చాలా పప్రత్యేకమయిన సినిమా, ఈ కధ చెప్పినప్పుడే ఈ సినిమా కి రాయాలి అని పించింది, డైరెక్టర్ సృజన గారు సినిమా ప్రతి ఫ్రేమ్ లో తన తపన కనిపిస్తుంది, సృజన గారి ఆలోచనలు చాలా కొత్త గా ఉంటాయి, బాబా గారి కుటుంబలో నన్ను ఒక ఫ్యామిలీ మెంబెర్ గా చూసుకుంటారు, కధ బాగుంటేనే బాబా గారు నిర్మాణం లో భాగం అవుతారు, ఇళయరాజా గారితో స్క్రీన్ లో నా నేమ్ పడటం నా అదృష్టం, శ్రీయ గారి తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం చేయటం చాలా సంతోషం చాలా మంచి నటి తను సినిమా చాలా బాగా వచ్చింది మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను.

డైరెక్టర్ సృజన మాట్లాడుతూ ఇళయరాజా గారు, సాయి మాధవ్ గారు, బాబా గారు, శ్రీయ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను,ఏ కధ చెప్పిన కానీ దానికి ఒక మోరల్ ఉండాలి అలాంటి కధ నే మా ఈ గమనం సినిమా, చిన్న కధ రాసి బాబా గారి కి, జ్ఞాన శేఖర్ గారి కి చెప్పాను స్టార్ చేద్దాం అన్నారు, తరువాత ఇళయరాజా గారికి చెప్పాను ఆయన విని నచ్చితే చేస్తాను అన్నారు, విన్న తర్వాత లే నిలబడు అన్నారు నాకు భయం వేసింది, తర్వాత ఫోటో తీసుకున్నారు చాలా సంతోషం అనిపించింది, గమనం సినిమా మనం చేస్తున్నాం అన్నారు,తరువాత శ్రీయ గారికి చెప్పాను తనకి బాగా నచ్చింది మనం కధ చేస్తున్నాం అన్నారు, తరువాత సాయిమాధవ్ బుర్ర గారి కి స్టోరీ నరేట్ చేశాను చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అలా సాయి మాధవ్ గారు మాతో ట్రావెల్ అవ్వటం జరిగింది, శివ కందుకూరికి తన క్యారెక్టర్ చెప్పాను, ప్రియాంక జవాల్కర్ గారికి చెప్పాను ఇద్దరు విన్న వెంటనే ఓకే చెప్పేసారు.అలాగే చైల్డ్ ఆర్టిస్ట్స్ గా మను, భాను నటించారు వాళ్ళకి నా థాంక్స్ అని చెప్పారు.

శ్రీయ శరన్ మాట్లాడుతూ థాంక్ యు సృజన, గమనం కధ సృజన హార్ట్ నుంచి వచ్చిన కధ, గమనం సినిమాలో నేను భాగమయినందుకు సంతోషంగా వుంది,నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరి కి నా థాంక్ యు.సాయిమాధవ్ గారి కి, బాబా గారికి, డైరెక్టర్ సృజన గారికి నా స్పెషల్ థాంక్స్.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడి చాలా రోజులు అయ్యింది, గమనం చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ఈ సినిమా లోని ప్రతి క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది, సినిమా చూసాక మీరు నేను చెప్పింది కరెక్ట్ అంటారు, మా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, త్వరలోనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం, మీకు అందరకి నచ్చుతుంది.

ప్రియాంక జవాల్కర్ ఈ స్టోరీ రియాలిటీ కి చాలా దగ్గరగా ఉంటది, ప్రతి సినిమా కి ఇలానే చెప్తున్నాను,ఫిల్మ్ కి వర్క్ చేస్తున్నప్పుడు మంచి క్వాలిటీ వున్న సినిమా చేస్తున్న అని నాకు అనిపించింది, శివ తో వర్క్ చేయటం చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను,మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము, శ్రీయ గారు చాలా అందంగా వుంటారు, మా సినిమా కి శ్రీయ గారి వల్ల చాలా అందం వచ్చింది, తప్పకుండ గమనం మూవీ మీకు నచ్చుతుంది అని చెప్పారు.

నటీనటులు :శ్రియ శరన్,నిత్య మీనన్,ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, సుహాస్, బిత్తిరి సత్తి,మను, భాను,చారు హాసన్, సంజయ్ స్వరూప్, రవి ప్రకాష్.

సాంకేతికవర్గం :
బ్యానర్ :క్రియా ఫిల్మ్ కార్పొరేషన్,కాళీ ప్రొడక్షన్స్
లిరిక్స్ :కృష్ణకాంత్, నర్సింత్ మేత
ఎడిటర్ :రామకృష్ణ అర్రం
కాస్ట్యూమ్ డిజైనర్ :ఐస్వర్య రాజీవ్
స్టంట్స్ :జాషువా
ఆర్ట్ :జేకే మూర్తి
చీఫ్ కో డైరెక్టర్ :సత్యం కలవకోలు
లైన్ ప్రొడ్యూసర్ :సిహేచ్.చంద్ర శేఖర్
సౌండ్ డిజైన్ :వరుణ్ వేణుగోపాల్
VFX:విసువల్ వండర్స్
డి.ఓ.పి : జ్ఞాన శేఖర్ వి. ఏస్
డైలాగ్స్ :సాయి మాధవ్ బుర్ర
ప్రొడ్యూసర్స్ :రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జ్జ్ఞాన శేఖర్ వి. ఏస్
స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ -సుజనా రావు
పి.ఆర్.వో :వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385