HomeTeluguదీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 10న విడుద‌ల‌వుతున్న ‘జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్’ మూవీని బ్లాక్...

దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 10న విడుద‌ల‌వుతున్న ‘జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్’ మూవీని బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళి సందర్బంగా ఈ మూవీ న‌వంబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జరిగింది. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ టికెట్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైల‌ర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బ‌రాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మ‌రోసారి ఈ ట్రైల‌ర్‌తో మ‌న‌కు చూపించాడు. ఔట్ స్టాండింగ్‌గా ఉంది. మూవీ త‌ప్ప‌కుండా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య వంటి టాలెంటెడ్ యాక్ట‌ర్స్ ఇందులో న‌టించారు. నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అయిన పెళ్లి క‌ళ వ‌చ్చేసిందే బాల‌.. ను లారెన్స్ మాస్ట‌రే కంపోజ్ చేశారు. త‌ను కొరియోగ్రాఫ‌ర్ నుంచి బెస్ట్ యాక్ట‌ర్ రేంజ్‌కి చేరుకున్నారు. ఎస్‌.జె.సూర్య, నా స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి సినిమాను డైరెక్టర్‌గా మ‌న‌కు ప‌రిచ‌యమే. ఆయ‌న పెర్ఫామెన్స్‌ల‌ను ఎలా రాబ‌డుతారో మ‌న‌కు తెలిసిందే. త‌నొక అద్భుత‌మైన యాక్ట‌ర్‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ గురించి చెప్పాలంటే త‌నొక క‌ల్ట్ డైరెక్ట‌ర్‌. జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ ట్రైల‌ర్ చూడ‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. త‌ను నాకోసం త్వ‌ర‌లోనే ఓ స్క్రిప్ట్ చేస్తాడ‌ని అనుకుంటున్నాను. సంతోష్ నారాయ‌ణ‌న్ గురించి స్పెష‌ల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ను క‌బాలిలో ర‌జినీకాంత్‌గారి ఇంట్ర‌డ‌క్ష‌న్ మ్యూజిక్‌కి ధీటుగా ఈరోజుకి ఎవ‌రూ మ్యూజిక్ ఇవ్వ‌లేదు. నాతో సైంధ‌వ్ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. గురు సినిమాకు ఇద్ద‌రం క‌లిసి వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు నాతో సంతోష్ పాట కూడా పాడించాడు. న‌వంబ‌ర్ 10న జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీని థియేట‌ర్‌లో చూసి బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాలి’’ అన్నారు.

రాఘ‌వ లారెన్స్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌కి స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన వెంక‌టేష్‌గారికి థాంక్స్‌. న‌వీన్ చంద్ర‌గారు అద్భుతంగా న‌టించారు. నిర్మాత కార్తికేయ‌న్ సంతానం భారీ బ‌డ్జెట్‌తో సినిమా చేశారు. ఎస్‌.జె.సూర్య‌గారు న‌ట‌ రాక్ష‌సుడు. ఈ సినిమాలో ఆయ‌న సైలెంట్‌గా చేసిన పెర్ఫామెన్స్ ఆడియెన్స్‌కి న‌చ్చుతుంది. కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో జిగ‌ర్ తండ సినిమాను చేయాల్సింది. మిస్ అయ్యింది. ఆయ‌న‌తో ప‌ని చేయాల‌ని నేనే ఆయ‌న‌కు ఫోన్ చేశాను. జిగ‌ర్ తండ 2 చేయాల‌ని ఫోన్ చేసిన ప్ర‌తీసారి చేద్దామ‌ని కార్తీక్ సుబ్బ‌రాజ్ చెప్పేవారు. ఓరోజు నిర్మాత కార్తికేయ‌న్‌గారు ఫోన్ చేసి స‌బ్జెక్ట్ రెడీ అయ్యింద‌ని చెప్పారు. సినిమాను స్టార్ట్ చేశాం. మేక‌ప్ లేకుండానే డైరెక్ట‌ర్‌గారు న‌న్ను న‌టింప చేశారు. ఇంత‌కు ముందు రాఘ‌వ లారెన్స్ న‌టించిన సినిమాలు వేరు.. ఈ సినిమాలో మ‌రోలా ఉంటుంది. ఆ క్రెడిట్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారికే ద‌క్కుతుంది. సంతోష్ నారాయ‌ణ‌న్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. త‌మిళనాడులో ట్ర‌స్ట్ పెట్టి ఎలాగైతే సేవ‌లు చేస్తున్నానో ఇక్క‌డ కూడా ట్ర‌స్ట్ పెట్టి సేవ‌లు అందించ‌బోతున్నాను. న‌వంబ‌ర్ 10న జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ రిలీజ్ అవుతుంది. థియేట‌ర్స్‌లో సినిమా చూసి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ ‘‘ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 10న‌ జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్‌తో మీ ముందుకు రాబోతున్నాం. కార్తీక్ సుబ్బ‌రాజ్ అనే గొప్ప డైరెక్ట‌ర్ క్రియేష‌న్‌లో ఈ సినిమాను చేశాం. త‌న మేకింగ్‌లో ఓ యూనిక్ స్టైల్ ఉంటుంది. త‌న వ‌ల్ల ఎంతో మంది కొత్త డైరెక్ట‌ర్స్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. 11 ఏళ్ల‌లో ఆయ‌న చేసిన బెస్ట్ మూవీ జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌. ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. లారెన్స్ మాస్ట‌ర్ ఇందులో మాస్ సైడ్‌తో పాటు పెర్ఫామెన్స్ సైడ్‌ను కొత్త‌గా చూపించారు. ఈ సినిమాలో పెద్ద డైలాగ్స్‌ను కూడా లుక్స్‌తో ఎలా చేయాల‌నే విష‌యాన్ని నేను నేర్చుకున్నాను. ఆ క్రెడిట్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారికే ద‌క్కుతుంది. సంతోష్ నారాయ‌ణ‌న్‌గారి మ్యూజిక్ బావుంది. క‌చ్చితంగా సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీ రిచ్‌నెస్‌, కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. తిరు వ‌ర‌ల్డ్ క్లాస్ స్టాండ‌ర్స్‌తో సినిమాటోగ్ర‌ఫీ అందించారు. అంద‌రూ సినిమాను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ గురించి ఇప్పుడు నేనేం మాట్లాడ‌ను. కానీ ఓ విష‌యం మాత్రం చెబుతాను. అది కోటి రూపాయ‌ల సినిమా అయినా, వంద‌కోట్ల‌ను మించిన సినిమా అయినా తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాల‌ను అస్స‌లు మిస్ కారు. మీరు ఈ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ‌తార‌ని భావిస్తున్నాను. కార్తీక్ సుబ్బ‌రాజ్ త‌న పిజ్జా సినిమా చేసిన త‌ర్వాత త‌న‌కు తెలుగులో వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. త‌ర్వాత త‌ను ఎన్నో సినిమాల‌ను చేశాడు. త‌న‌తో తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌నుకుంటున్నాను. మా బ్యాన‌ర్‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్‌ మూవీ ఇదే. లారెన్స్ మాస్ట‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, న‌వీన్ చంద్ర స‌హా అంద‌రికీ థాంక్స్‌. దీపావ‌ళికి నవంబ‌ర్ 10న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా పిజ్జా చేసినప్పుడు థియేటర్ విజిట్‌కి వెళ్లాను. అక్క‌డ నా సినిమా రెస్పాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ క్ష‌ణాల‌ను నేనిప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ సినిమా నాకెంతో స్పెష‌ల్ మూవీ. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి విడుద‌ల‌వుతున్న సినిమా ఇది. మీరు క‌చ్చితంగా డిసప్పాయింట్ కారు. ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతారు. ఎస్‌.జె.సూర్య‌గారు తెలుగు ఆడియెన్స్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డ‌బ్బింగ్ చెప్పారు. ఏషియ‌న్ ఫిలింస్‌, ఎస్‌.పి.ప్రొడ‌క్ష‌న్స్‌కి థాంక్స్‌. న‌వంబ‌ర్ 10న జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌ను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

సంతోష్ నారాయ‌ణ‌న్ మాట్లాడుతూ ‘‘ద‌స‌రా సినిమా త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్న మ‌రో సినిమా ఇది. వెంక‌టేష్‌గారితో క‌లిసి సైంధ‌వ్ సినిమా చేస్తున్నాను. జిగ‌ర్ తండ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో అలాగే జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ మూవీ కూడా ఆక‌ట్టుకుంటుంది. రాఘ‌వ లారెన్స్, ఎస్‌.జె.సూర్య‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యం. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీలో నాకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కార్తీక్ సుబ్బ‌రాజ్ వ‌ర్కింగ్ స్టైల్‌ను ఎప్ప‌టి నుంచో ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తున్నాను. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య పెర్ఫామెన్స్‌లు అద్భుతంగా ఉన్నాయి. లారెన్స్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయ‌న చేస్తున్న మంచి ప‌నుల‌ను చూసి ఇన్‌స్పైర్ అవుతుంటాను. న‌వంబ‌ర్ 10న రిలీజ్ అవుతోన్న జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ ఆడియెన్స్‌కి ఓ కిక్ ఇస్తుంది’’ అన్నారు.

న‌వీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలో క‌నీసం ఒక ఫ్రేమ్‌లో అయిన క‌నిపించాలని అనుకున్నాను. కానీ జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీలో మెయిన్ విల‌న్‌గా న‌టించాను. లారెన్స్‌గారి స్టెప్పుల‌ను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలో ప్రాక్టీస్ చేయించేవారు. ఇప్పుడు ఆయ‌న‌తో ఢీ అంటే ఢీ అనే రోల్‌లో క‌నిపించ‌బోతున్నాను. ఇక సూర్య‌గారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న్ని న‌ట రాక్ష‌సుడు అంటుంటారు. ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసే విధానం మాట‌ల్లో చెప్ప‌లేం. సంతోష్ నారాయ‌ణ‌న్‌గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. న‌వంబ‌ర్ 10న రేపు థియేట‌ర్‌లో జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES