శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం

696

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రం లో అయిదు పాటలు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశంలో సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నాగ శౌర్య ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తం షాట్ కి తాను క్లాప్ కోటి తన శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం హీరో విజయ్ రాజా పాత్రికేయులతో మాట్లాడుతూ “మా చిత్రం ప్రారంభొత్సనికి విచ్చేసిన హీరో నాగ శౌర్య అన్న కి చాలా ధన్యవాదాలు. నాకు హీరో గా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది” అని తెలిపారు.

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. నాకు మంచి నిర్మాత దొరికాడు, ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఓపెనింగ్ కి వచ్చిన హీరో నాగ శౌర్య కి నా ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి పర్ఫెక్ట్. ఇది పూర్తీ ఎంటర్టైనర్ చిత్రం. శివాజీ రాజా గ్రాము కథ విన్నారు, ఆయనికి కథ బాగా నచ్చింది. మా హీరో గారు మాస్ కి క్లాస్ కి రెండిటికి సూట్ అవుతారు. అయన ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒరిస్సా లో టాప్ హీరోయిన్, మంచి నటి. నిర్మాత గారి తమ్ముడు ఇందులో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు” అని తెలిపారు.

శివాజీ రాజా మాట్లాడుతూ “ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలు. కథ బాగుంది. ఇద్దరు హీరోయిన్. నాగ శౌర్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ “ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు” అని తెలిపారు.

నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ ” జయ దుర్గ దేవి మల్టీ మీడియా ఇది మా మొదటి సినిమా.మా కార్యక్రమానికి వచ్చినందుకు హీరో నాగ శౌర్య గారికి ధన్యవాదాలు. మంచి కథ తో వస్తున్నాం, చాలా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా తో చేయటం చాలా సంతోషం గా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి” అని అన్నారు.

నటి నటులు :

బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా

విజయ్ రాజు, శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, గడ్డి సుబ్బా రావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు.

కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని సింగ్
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్

ఎడిటర్ :వినోద్
పి ఆర్ ఓ : హర్ష
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
నిర్మాత : తూము నరసింహ పటేల్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్