సస్పెన్స్ థ్రిల్లర్ ఐఐటి కృష్ణమూర్తి ట్రైలర్ విడుదల, డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు!

499

క్రిస్టోలైట్ మీడియా క్రియేష‌న్స్, అక్కి ఆర్ట్స్ బ్యాన‌ర్లు పై మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో నూత‌న తార‌లు పృధ్వీ దండ‌మూడి, మైరా దోషి జంట‌గా న‌టించిన చిత్రం ఐఐటి కృష్ణ మూర్తి. ఈ సినిమాతో శ్రీ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ప్ర‌సాద్ నేకూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 10న ప్ర‌ముఖ ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ప‌ద్ధ‌తిలో విడుద‌ల అవ్వ‌బోతుంది. ఐఐటి కృష్ణ‌మూర్తి అనే అనే టైటిల్ క్యాచీగా ఉండ‌టంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఐఐటి కృష్ణ‌మూర్తి టీజ‌ర్ కు, పాట‌ల‌కు సోష‌ల్ మీడియాలో విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, స్టార్ ఫిల్మ్ మేక‌ర్ హ‌రీశ్ శంక‌ర్ తాజాగా ఐఐటి కృష్ణ మూర్తి ట్రైల‌ర్ ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి చిత్ర బృందానికి శుభాబినంద‌న‌లు తెలిపారు. ఐఐటి కృష్ణ మూర్తి క‌చ్ఛితంగా ప్ర‌క్ష‌కుల్ని అల‌రిస్తోంద‌ని ట్విట్ చేశారు హరీశ్ శంక‌ర్. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మీడియ‌న్ స‌త్య‌, విన‌య్ వ‌ర్మ‌, బెన‌ర్జీ త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి న‌రేశ్ కుమార‌న్ సంగీతాన్ని అందించారు, అక్కి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్ పాల్గొన్నారు.

నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ
ఐఐటి కృష్ణమూర్తి సినిమా కాన్సెప్ట్ బాగుంది. చిత్ర టీజర్, ట్రైలర్ బాగున్నాయి. నటీనటులు బాగా చేశారు, డైరెక్టర్ కథ, కథనాల ఎంపిక బాగుంది. సినిమా సక్సెస్ అవుతుందనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. డిసెంబర్ 10న రాబోతున్న ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చి చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.

కో ప్రొడ్యూసర్ అక్కి మాట్లాడుతూ
అందరికి నమస్కారం ఫ్యామిలీతో కలసి అందరూ చూడదగ్గ సినిమా ఐఐటి కృష్ణమూర్తి. ఈ సినిమా చూసినవారు బాగుందని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న మా సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడా బోర్ లేకుండా ఆత్యంత ఆసక్తికరంగా ఈ సినిమా ఉండబోతుంది తెలిపారు.

హీరోయిన్ మైరా దోషి మాట్లాడుతూ
ఐఐటి కృష్ణమూర్తి మూవీ నాకు చాలా స్పెషల్. నా రోల్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ గారికి, డైరెక్టర్ శ్రీవర్ధన్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత ప్రసాద్ నేకూరి మాట్లాడుతూ
కేఎస్.రామారావు గారు మా సినిమా టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చెయ్యడానికి విచ్చేసిన నా మిత్రుడు నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. శ్రీవర్ధన్ ఈ సినిమాను మంచి కథ కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించారని తెలిపారు.

డైరెక్టర్ శ్రీవర్ధన్ మాట్లాడుతూ
నన్ను నమ్మి నాతో ఈ ప్రాజెక్ట్ చేసిన నిర్మాత గారికి కృతజ్ఞతలు. తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చే జానర్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. షూటింగ్ సమయంలో సహకరించిన అందరికి ధన్యవాదాలు. డిసెంబర్ 10న విడుదల కాబోతున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.

హీరో పృధ్వీ దండ‌మూడి మాట్లాడుతూ
డిసెంబర్ 10న విడుదల కాబోతున్న మా ఐఐటి కృష్ణమూర్తి సినిమా మీ అందరికి నచ్చుతుంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా సక్సెస్ అవుతాయి అలాగే మా సినిమా మీ అందరికి నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

తారాగ‌ణం:
పృధ్వీ దండ‌మూడి, మైరా దోషి, స‌త్య‌, విన‌య్ వ‌ర్మ‌, బెన‌ర్జీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్ – క్రిస్టోలైట్ మీడియా క్రియేష‌న్స్, అక్కి ఆర్ట్స్
నిర్మాత – ప్ర‌సాద్ నేకూరి
కెమెరా – ఏసు
ఎడిటింగ్ – అనిల్ కుమార్ పి
మ్యూజిక్ – న‌రేశ్ కుమార‌న్
స‌హనిర్మాత – అక్కి
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం – శ్రీవ‌ర్ధ‌న్

Eluru Sreenu
P.R.O