తెలుగు,క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల్లో `స‌మిధ` చిత్రం ప్రారంభం.

565

‘మర్మం’,’కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెర‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి. ఆయ‌న‌ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు,క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల‌లో తెర‌కెక్కుతోన్నచిత్రం ‘సమిధ`. క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువ‌ర్ణ‌, త‌మిళ న‌టి ఛాందిని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ మూవీ హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఆశీశ్ క్లాప్ కొట్ట‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ కెమెరా స్విచాన్ చేశారు. డిసెంబ‌ర్ 8 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈసంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ – “నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మొద‌టి చిత్రం`స‌మిధ`‌. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన‌ ఒక య‌దార్ధ గాథ‌ని ఇన్స్‌పిరేష‌న్‌గా తీసుకుని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా అన్నిక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌ భాష‌ల‌లో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నాను. క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా న‌టిస్తున్నారు. అనువ‌ర్ణ‌, ఛాందిని హీరోయిన్స్‌. ఈ సినిమా రెండు గంట‌ల పాటు ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తోపాటు చేజింగులు, యాక్ష‌న్ సీన్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కులని ఎంగేజ్ చేస్తుంది. క‌చ్చితంగా ఆడియ‌న్స్‌కి ఒక ఫ‌ర్ఫెక్ట్ థ్రిల్ల‌ర్ చూసిన అనుభూతినిస్తుంది. ‌క‌న్న‌డ‌లో `స‌మిథ్‌` పేరుతో రూపొందుతోంది. అలాగే త‌మిళ టైటిల్ త్వ‌ర‌లోనే ఫిక్స్ చేస్తాం. మూడు భాష‌ల్లోనూ షూట్ చేస్తున్నాం. మ‌ల‌యాళంలో డ‌బ్బింగ్ చేస్తున్నాం. ర‌వివ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వికాలే, కేపివై బాలా వంటి మూడు భాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. హైద‌రాబాద్, చైన్నె, బెంగుళూరు‌లో షూటింగ్ జ‌ర‌ప‌నున్నాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.“` అన్నారు.

హీరో అక్షిత్ శ‌శికుమార్ మాట్లాడుతూ – “తెలుగులో `స‌మిధ` నా రెండ‌వ చిత్రం. ఈ సినిమా ఒక థ్రిల్ల‌ర్ క‌థాంశం అయినా ఇన్‌బిల్ట్ ఒక‌ ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఉంటుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా నాకు హీరోగా మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు స‌తీష్ మాలెంపాటి గారికి, అరుణం ఫిలింస్ వారికి నా హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు“ అన్నారు.

హీరోయిన్ అనువ‌ర్ణ మాట్లాడుతూ – “`ఉండిపోరాదే` హీరోయిన్ గా నా మొద‌టి చిత్రం. ఆ త‌ర్వాత నేను న‌టించిన రెండు చిత్రాలు విడుద‌ల‌కి సిద్దంగా ఉన్నాయి. స‌మిధ హీరోయిన్‌గా నా నాలుగ‌వ చిత్రం. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంత‌మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు స‌తీష్ మాలెంపాటి గారికి నా కృతజ్ఞ‌త‌లు. నాకు స‌పొర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్యూ వెరీమ‌చ్‌“ అన్నారు.

అక్షిత్ శ‌శి కుమార్‌, అనువ‌ర్ణ‌, ఛాందిని, ర‌వివ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి, శ్రావ‌ణ్‌, ర‌వికాలే, బ్లాక్ పాండీ, కేపివై బాలా, శంక‌ర్ మూర్తి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి..సినిమాటోగ్ర‌ఫి: స‌తీష్ ముత్యాల‌, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్‌: బి. నాగేశ్వ‌ర రెడ్డి‌, ఆర్ట్‌: ముర‌ళి, నిర్మాణం: అరుణం ఫిలింస్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ మాలెంపాటి.