*”లవ్ యు టూ” ట్రైలర్ ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్*

596

*హ్యాస్ ట్యాగ్ పిక్చర్ బ్యానర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ప్రాచి ,జ్యోతి నటీనటులు గా యోగి కుమార్ దర్శకత్వంలో శ్రీకాంత్ కీర్తి నిర్మిస్తున్న “లవ్ యు టూ” చిత్రం ట్రైలర్ ను అఫీషియల్ గా వి.వి. వినాయక్ గారు తన బర్త్ డే సందర్భంగా వైజాగ్ లో విడుదల చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ కు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నువ్వు తోపురా డైరెక్టర్ హరినాథ్ తో పాటు తదితర సినిపెద్దలు ముఖ్య అతిథిదులుగా పాల్గొని చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో*

*చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ..* నేను ఈ చిత్రం ద్వారా ఇద్దరికి థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను.నేను ఈ చిత్రానికి దర్శకుడిగా ఉండాలని నా గత షార్ట్ ఫిలిమ్స్ లను సందీప్ నిర్మాతకు పంపడంతో ఇంత పెద్ద ప్రాజెక్టు కు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు నిర్మాత శ్రీకాంత్.ఇలాంటి అవకాశం చాలా మందికి రాదు. ఎంతోమంది దర్శకులు డైరెక్షన్ చేసే ఆపర్చునిటీస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ సందీప్ ద్వారా నాకొచ్చిన ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే వీరిద్దరికీ నేను ధన్యవాదాలు

*నటి జ్యోతి మాట్లాడుతూ ..* దర్శకుడికి ప్రొడ్యూసర్స్ ఇది ఒక థాంక్స్ చెప్తే సరిపోదు.వాళ్ళు కావాలనుకుంటే సీనియర్ హీరోయిన్స్ ని పెట్టుకోవచ్చు గానీ జ్యోతియే ఈ క్యారెక్టర్ కు బాగుంటుందని నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకున్నారు వారికి నా ధన్యవాదాలు .ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. డి.ఓ.పి గారు నన్ను చాలా అందంగా చూయించారు.ప్రాచి చాలా బాగా చేశాడు. దర్శకుడు గురించి చెప్పాలి అంటే ఈ స్టేజీ, ఈ మైక్ సరిపోదు మా లాగా ఉన్న చక్కటి సంసారాల్లో చిచ్చుపెట్టి నాశనం చేసి వీటిని చూసి ఈ సినిమా తీస్తే వీటిని చూసి ఈ జనరేషన్ లో కొత్తగా పెళ్లి చేసుకున్న వారందరికి ఐన్స్పిరేషన్ గా నిలుస్తూ ఇలాంటి మంచి సినిమా మన ముందుకు తీసుకు వచ్చారు.

*హీరో ఆట సందీప్ మాట్లాడుతూ..* వివి వినాయక్ గారికి నా ధన్యవాదాలు తను ఎంతో బిజీగా వున్న మాకోసం టైం ఇచ్చి మా ట్రైలర్ ను విడుదల చేశారు . శ్రీకాంత్ గారికి సినిమా అంటే ప్యాషన్ తను చాలా సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా నిలబడాలని కోరుకుంటున్నాను. తను ఎంత ప్యాసినెట్ ప్రొడ్యూసర్ అంటే మాఇద్దరినీ పెట్టి ఇలాంటి ఎంత మెసేజ్ ఉన్న సినిమా తీసుకున్నందుకు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పని చేశారు.ప్యాండమిక్ స్విచ్వేషన్ లో కూడా అందరం కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాము. ప్రాచీ చాలా సపోర్ట్ చేసింది రొమాంటిక్ సీన్స్ లో కూడా చాలాకంఫర్టబుల్ గా నటించింది. నా భార్య జ్యోతి నేను చేసే సీన్స్ లలో ఇలా కాదు అలా చేయమని నాకు సపోర్ట్ గా నిలిచి చెప్పడం జరిగింది.తనని నేను కో యాక్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. తను మై లవ్ అని చెప్పగలను నా లైఫ్ లో వైఫ్ అని చెప్పగలను. అందరూ ఇది నీ సబ్జెక్టు కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది నా సబ్జెక్ట్ కాదు దర్శకుడు ఇప్పుడు జరుగుతున్న కథలను బేస్ చేసుకొని తీసిన కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అలాగే కరోనా టైంలో నేను మా ఫాదర్ ని కోల్పోవడం జరిగింది.దీన్ని నేను లైఫ్ లో జీర్ణించుకోలేక పోతున్నాను.మా ఫాదర్ షూటింగు చూస్తుండగానే చనిపోవడం జరిగింది. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇది నాకు తీరని లోటు. కరోనా కాలంలో ఎంతో మంది ఎంతోమందిని కోల్పోయారు వారిలో నేను ఒకరిని. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫాదర్ కోల్పోవడం పోయినందుకు నాకు చాలా బాధ గా ఉంది. నా వైఫ్ కూడా నాకు సపోర్ట్ గా నిలిచి నాకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని కన్నీటి పర్యంతం అయ్యారు.

*నటి ప్రాచీ మాట్లాడుతూ* .. దర్శకుడు కి తన విజన్ ఏంటో ఇందులో చాలా చక్కగా చూపించాడు .ఇలాంటి మంచి మూవీ లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాత లకు ధన్యవాదాలు.

*డి.ఓ.పి. శ్యామ్ మాట్లాడుతూ..* ఇప్పటి వరకు మేము నిర్మాత శ్రీకాంత్ ను చూడలేదు తను మమ్మల్ని అంతగా నమ్మారు. ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది..

*సంగీత దర్శకుడు సాకేత్ మాట్లాడుతూ* .. చాలా బోల్డ్ మూవీ ని సెలెక్ట్ చేసుకొని దర్శకుడు ఈ సినిమా చేయడం జరిగింది.ఒక మంచి కాన్సెప్ట్ ని సింపుల్ గా నీట్ గా తీసుకొచ్చాడు. లైవ్ లో మమ్మల్ని చూడకపోయినా వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని మానిటర్ చేస్తూ మామీద నమ్మకంతో అంతగా నన్ను ఖర్చు పెట్టి తీశారు శ్రీకాంత్ గారు ఇక్కడ నుండి మాకు చాలా సపోర్ట్ చేశారు సందీప్, జ్యోతి ,ప్రాచీ ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేశారు సినిమాలో ఉన్న మూడు మెయిన్ క్యారెక్టర్స్ తో అద్భుతంగా చూయిస్తూ చాలా బోల్డ్ కంటెంట్ తీసుకొని చేయడం జరిగింది .

*ఆర్ట్ డైరెక్టర్ వేణు మాట్లాడుతూ..* నాకు ఇలాంటి మంచి చిత్రానికి సెట్ వేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*కేశవ్ దీపక్ మాట్లాడుతూ* .. లవ్ యు టూ కాన్సెప్ట్ మూవీ సెన్సిటివ్ సబ్జెక్ట్. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని మూవీ ని తెరకెక్కించాడు. సందీప్ కాంబినేషన్ లో నా సీన్స్ ఉంటాయి.సందీప్ గారు చాలా అద్భుతంగా పర్ఫామెన్స్ చేశారు.ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.

*అభిలాస్ మాట్లాడుతూ* ..2019 నుండి సందీప్ తో పరిచయం ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే సందీప్ గారు నన్ను రిఫర్ చేశాడు.ఇదే నా మొదటి చిత్రం .ఇంత పెద్ద యూనిట్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

*నటీనటులు*
ఆట సందీప్, ప్రాచి ,జ్యోతి, అభిలాస్,కేశవ్ దీపక్ తదితరులు

*సాంకేతిక నిపుణులు*
బ్యానర్ : హ్యాస్ ట్యాగ్ పిక్చర్స్
సినిమా : “లవ్ యు టూ”
దర్శకత్వం :యోగి కుమార్
నిర్మాత : శ్రీకాంత్ కీర్తి
ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీకాంత్
సంగీతం : సాకేత్
డి.ఓ.పి. శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ వేణు
పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను మేఘశ్యామ్, నివాస్

Eluru Sreenu
P.R.O