నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేసి, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి, ‘సవారి’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించారు. ‘సవారి’ బిగ్ టికెట్ ను హీరోలు కార్తికేయ, విష్వక్ సేన్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఇద్దరూ రూ. 10 వేలకు టికెట్లను కొనుగోలు చేశారు.
డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, “ఈ సినిమాను మా అన్నయ్య సంతోష్, మా ఫ్రెండ్ నిషాంక్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. యు.ఎస్.లో ఈ సినిమా 25 స్క్రీన్స్ లో రిలీజవుతోంది. గత 25 రోజులుగా మా యూనిట్ మెంబర్స్ ఎవరూ నిద్రపోకుండా ఈ సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. మోనిష్ భూపతిరాజా సినిమాటోగ్రఫీ వల్లే విజువల్స్ ఇంత బాగా వచ్చాయి. షూటింగ్ పూర్తయిన దగ్గర్నుంచీ నాకంటే ఎక్కువగా ఎడిటర్ సంతోష్ పనిచేస్తూ వచ్చాడు. నేను సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడే శేఖర్ చంద్రను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నా. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అని అనుకుంటున్నా. ఆడిషన్ చేసేవరకు తనలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. సీన్ ఇస్తే చింపేసేవోడు. స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తెలంగాణా యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ కు నేనైతే షాకైపోయి చాలా సార్లు క్లాప్స్ కొట్టాను. ఈ సినిమా తర్వాత తను ఇంకో స్థాయికి వెళ్తాడని గట్టిగా నమ్ముతున్నా. నా ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘బందం రేగడ్’లో చేసిన ప్రియాంక ఈ సినిమాతో తనదైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నా. కొత్త ఫిలింలు రావాలని అందరూ అంటుంటారు. కచ్చితంగా ‘సవారి’ కొత్త కథతో వస్తున్న మూవీ. ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. కచ్చితంగా హిట్ కొడతామని అనుకుంటున్నా. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలింస్ వాళ్లు, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో సుధా శ్రీ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న మా సినిమాని థియేటర్లలో చూడండి” అని చెప్పారు.