విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’

553

ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో ప్రొడక్షన్ పై మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ ‘హలో జూన్‘. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ ట్రావెలింగ్. కాలేజీ జీవితంలో ఆ అమ్మాయి ప్రేమలో ఏ విధంగా మసులుకొంది. ఈ ఒడిదుడుకుల్లో ఆమె ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మజిలీలు చోటుచేసుకున్నాయి.. ఆమె ఫ్రెండ్ షిప్ ఎలా సాగింది.

ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండులనుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అనే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కదిలిస్తాయి. రాజిష విజయన్ గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఇప్పటికే తమిళంలో కర్ణన్, జైభీమ్ చిత్రాలను చేసి మంచి క్రేజ్ ని, నటిగా పేరుని సంపాదించుకుంది. ఈ సినిమాకి ఆమె నటన హైలెట్ గా ఉంటుంది. ఇందులో ఆమె చేసిన ప్రతీ సన్నివేశం సూపర్ గా ఉండడమే కాదు.. అదిరిపోయే రేంజులో ఆమె క్యారెక్టర్ రూపకల్పన జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. రాజిష విజయన్ ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ మా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.

ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. ఇందులో నటించిన వారంతా చక్కటి నటనను కనబరిచారు. టెక్నీషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో ఎవ్వరూ ఎక్సెప్ట్ చెయ్యని సన్నివేశాలు ఉంటాయి. ప్రతీ సీన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. ఈ ‘హలో జూన్’ మ్యూజికల్ గా కూడా బాగా హిట్ అవుతుందన్ననమ్మకం ఉంది. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. సందర్భానుసారంగా వచ్చే ఈ పాటలు వీక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఈ సినిమాని హీరో సందీప్ కిషన్, దర్శకులు దేవాకట్టా, అజయ్ భూపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ ‘హలో జూన్’ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అన్నారు.

ఈ చిత్రానికి కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు , డైలాగ్స్ : అనిల్ రెడ్డి.ఎం , పాటలు: శ్రీ సిరాగ్, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ : రాజేష్ , డి.ఓ.పి : జితిన్ స్టానిష్ లస్, మ్యూజిక్ : ఇఫ్తీ, ఎడిటర్ : లిజోపౌల్ , ఆర్ట్ : అరుణ్ వింజరాముడు.