రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్రముఖ వ్యాపారవేత్త, వసుధ ఫౌండేషన్ అధినేత మంతెన వెంకట రామరాజు. “ఎంపీ సంతోష్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళ్తుండడం, అందులో తాను కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని.. భావి తరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు వసుధ వెంకట్రామ రాజు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు!!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన “వసుధ ఫౌండేషన్” మంతెన వెంకట రామరాజు!!
Previous article
RELATED ARTICLES