గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్

140


ప్రపంచంలో అన్ని వస్తువులు EMI లో దొరుకుతాయి. అలాగే అమ్మాయి కూడా EMI లో దొరికితే ఎలా ఉంటుంది అనేదే మా ” EMI ఈ అమ్మాయి “.దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నోయల్ సీన్ , బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి నటీ నటులుగా దొంతు రమేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి. రమేష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు నవీన్ మేడారం, అజయ్ సామ్రాట్, గోపి గణేష్, నిర్మాత బుర్రా ప్రశాంత్ గౌడ్, హీరో, నిమ్మల శ్రీరామ్, నటి సంగీత, నటి సంధ్య జనక్, జర్నలిస్ట్ ప్రభు,నిర్మాత కీర్తి లత గౌడ్ , నటులు దిల్ రమేష్, సునామి సుధాకర్, గంగాధర్, నవీన్, క్రిష్, దర్శకుడు తండ్రి దొంతు బుచ్చియ్య, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ రాజీవ్,మోడల్ ఉదయ్ శ్రీ, బింబిసార చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం

సమర్పకులు దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ.. వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రక రకాల సమస్యలను కథాంశంగా తీసుకొని రూపొందించిన చిత్రమే “EMI.ఈ అమ్మాయి” సినిమా చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాము. నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో .సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించండి.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు

చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ..మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మాది వెస్ట్ గోదావరి లోని మారు మూల గ్రామం. మా నాన్న ఒక రైతు నేను కన్న కలను నిజం చేయడానికి మా నాన్న నన్ను సపోర్ట్ చేశాడు.కరోనా టైం లో ఈ సినిమా కొరకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా మా నాన్న మాకు అండగా నిలబడి సినిమా ను పూర్తి చేశారు.ఇందులో నటించిన భానుశ్రీ, నోయల్ చాలా సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా అయితే బాగా వచ్చింది. కానీ సినిమా విడుదల చేయడానికి ఇబ్బంది పడుతున్న మాకు ఈస్ట్ వెస్ట్ రాజీవ్ గారు, బుర్రా ప్రశాంత్ గౌడ్ గార్లు సపోర్ట్ గా నిలబడి మాకు ధైర్యాన్ని ఇచ్చి సినిమాను రిలీజ్ చేయిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీ లో ఉంటే ఏ చిన్న నిర్మాత కూడా ఇబ్బంది పడరు. ఈ నెల 10 న వస్తున్న మా “EMI ఈ అమ్మాయి” సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ..ఒక తండ్రి కృషి, కొడుకు ప్రయత్నం అని చాలా సార్లు విన్నాను. అయితే ఈ సినిమా ద్వారా ఈ తండ్రి కొడుకులను కళ్లారా చూశాను. చాలా మంది సినిమాల్లోకి వెళతాను అంటే ఎంకరేజ్ చెయ్యరు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే “EMI ఈ అమ్మాయి” .ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు చిరంజీవి తో చెయ్యాలనే ఆశ ఉంటుంది కానీ మీలాంటి దర్శక, నిర్మాతలు అవకాశం ఇచ్చినపుడు దాన్ని ప్రూవ్ చేసుకుంటేనే అలాంటి అవకాశాలు వస్తాయి. ఈ సినిమా నోయల్ చేస్తే బాగుంటుంది అని నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకొన్నందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. హీరోయిన్ బాను చాలా హార్డ్ వర్కర్ తను ఇందులో చాలా బాగా నటించింది. ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ భాను మాట్లాడుతూ.. “EMI ఈ అమ్మాయి.” అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆది పూర్ పీపుల్ నుండి రిచ్ పీపుల్ వరకు EMI కట్టకుండా ఉండేటటువంటి ఇల్లు ఉండదు.కాబట్టి “EMI ఈ అమ్మాయి” అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. దర్శకుడు ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే చేయడానికి ఒప్పుకున్నాను, మా చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాను.

నటీనటులుః
నోయల్ సీన్ , బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి, హరితేజ, చందన, మహేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :: శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్
నిర్మాత : డి. రమేష్ గౌడ్
కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం : దొంతు రమేష్
సినిమాటోగ్రఫీ : యం.మోహన్ చంద్
సంగీతం : రవిశంకర్
ఎడిటర్‌ : ,నందమూరి హరి
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, శ్రీ మణి, చిర్రవూరి విజయ్ కుమార్,
డైలాగ్స్ : గటికాచలం, కేశవ కొన,
కో డైరెక్టర్ : కే. శ్రీనివాస రావ్
ఆర్ట్స్ యం. యస్. వాసు
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్