హీరోగా “గణేష్ బెల్లంకొండ” చిత్రం ”స్వాతిముత్యం” ఆగస్ట్ 13 న విడుదల

294


*ఆకట్టుకుంటున్న విడుదల
తేదీ ప్రచార చిత్రం
*ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం”స్వాతిముత్యం”

‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం
‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు.

దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ఇటీవల విడుదల అయిన ‘స్వాతిముత్యం’ ప్రచార వీడియో చిత్రంవినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందిందని, అందులోని దృశ్యాలు చూసిన అందరికీ అనిపించింది. వీడియో చిత్రం లోని సంభాషణలు సైతం ఈ విషయాన్ని బలపరిచాయి.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ