“గంధర్వ “చిత్రం నుండి రెండవ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.

425

యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన యాక్షన్ థ్రిల్లర్ “గంధర్వ “చిత్రం నుండి రెండవ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ధనుంజయ్, మోష్మి నేహా ఆలపించిన ” కన్నులకే కానుకవే…. చిన్ని గుండెకే ఊపిరివే… వెన్నెలకే వెలుతురువే … గుండెలలో సవ్వడివే … అన్న పల్లవితో ఆహ్లాదకరమైన సాహిత్యంతో సాగిన ఈ గీతానికి సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అద్భుతమైన మెలోడియస్ ట్యూన్ సమకూర్చారు . జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా, మలయాళీ బ్యూటీ గాయత్రి ఆర్.సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్ గా నటించిన తమ “గంధర్వ” చిత్రం కథాపరంగా,సాంకేతిక పరంగా, సంగీత పరంగా,మేకింగ్ పరంగా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది అంటున్నారు చిత్ర దర్శక రచయిత అఫ్సర్ హుస్సేన్.కాగా ఈ చిత్రం నుండి మొదటి పాటను నెల రోజుల క్రితం ప్రముఖ యువ దర్శకుడు బాబీ విడుదల చేశారు .

సీనియర్ హీరోలు సాయి కుమార్ సురేష్ లతో పాటు బాబు మోహన్, పోసాని కృష్ణ మురళి, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ రోహిణి, మధు నంబియార్, అమెరికా జై రామ్, రూపాలక్ష్మి , పింగ్ పాంగ్ సూర్య, ఆర్జీవీరామ్, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించిన గంధర్వ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

మార్చి మూడవ వారం లో ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే ఈ యాక్షన్ థ్రిల్లర్ కు డిఓపి: జవహర్ రెడ్డి, మ్యూజిక్: ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: కురుమూర్తి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
వై .నాగు, చీఫ్ కో-డైరెక్టర్ ప్రకాష్ పచ్చల, నిర్మాత ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్,
కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అఫ్సర్ హుస్సేన్.