శ్రీ‌రంగ‌నీతులు చిత్రం నుండి ఎక్క‌డ‌వుండాల‌ని.. ఎక్క‌డున్నావో.. ఏమీ అవుదామ‌ని.. ఏమీ అయ్యావో.. లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

164


సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి ఎక్క‌డ‌వుండాల‌ని.. ఎక్క‌డున్నావో.. ఏమీ అవుదామ‌ని.. ఏమీ అయ్యావో.. అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు. హ‌రికా నారాయ‌ణ్ ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మాన‌వ సంబంధాల గురించి, నేటి యువ‌త మ‌న‌స్త‌త్వాల గురించి, ప్రేమ గురించి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా కొన‌సాగే పాట ఇది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన చిత్ర‌మిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువ‌త ఆలోచ‌న‌లు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల క‌ల‌యిక‌తో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అంద‌ర్ని అల‌రించే విధంగా తెర‌కెక్కించాడు. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాం అన్నారు.