HomeTeluguప్ర‌తి ఒక్క‌రూ సీట్ఎడ్జ్‌లో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా టెనెంట్: ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో అతిథులు

ప్ర‌తి ఒక్క‌రూ సీట్ఎడ్జ్‌లో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా టెనెంట్: ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో అతిథులు

పొలిమేర -2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం త‌రువాత సత్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్న మ‌రో డిఫ‌రెంట్ చిత్రం టెనెంట్‌. మేఘా చౌద‌రి క‌థానాయిక‌. వై.యుగంధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో క‌థ‌నాయిక ఎస్తేర్ ఓ ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మహాతేజ క్రియేష‌న్స్ ప‌తాకంపై మోగుళ్ళ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్రమం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్యక్ర‌మానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నిర్మాత సాహు గార‌పాటి, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌, హీరో సుడిగాలి సుధీర్‌లు ట్ర‌యిల‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా శివ నిర్వాణ మాట్లాడుతూ ఈ టీమ్ అంతా నాకు బాగా తెలుసు. సినీ ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకుని నిజాయితీగా శ్ర‌మిస్తే ఆల‌స్య‌మైనా స‌క్సెస్ త‌ప్ప‌కుండా వ‌రిస్తుంది అని చెప్ప‌డానికి ఈ వేదిక మీద వున్న స‌త్యం రాజేష్‌, సుడిగాలి సుధీర్‌లు నిద‌ర్శ‌నం. ఇద్ద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ రోజు హీరోలుగా నిరూపించుకున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఎంతో ప్ర‌తిభ గ‌ల వ్య‌క్తి. నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికి మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. ఈ చిత్ర నిర్మాత మంచి అభిరుచి గ‌ల నిర్మాత అని, యూనిక్ క‌థ‌ల‌తో త‌ను సినిమాలు నిర్మిస్తుంటార‌ని, టెనెంట్ ట్రయిల‌ర్ ఆస‌క్తిని క‌లిగించే విధంగా వుంద‌ని త‌ప్ప‌కుండా చిత్రం విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంద‌ని సాహు గార‌పాటి తెలిపారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభంలో న‌న్ను ఎంతో ఎంక‌రైజ్ చేసిన సత్యం రాజేష్ గారు ఈ రోజు వరుస‌గా హిట్‌లు సాధించ‌డం ఆనందంగా వుంది. వైవిధ్య‌మైన సినిమాలు చేసే నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి గారు ఈ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకోబోతున్నాడు అన్నారు.

క‌థానాయ‌కుడు స‌త్యం రాజేష్ మాట్లాడుతూ క‌థ ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌గానే ఎంతో న‌చ్చింది. క‌థ‌లో అన్ని ఎమోష‌న్స్ వున్నాయి. ఆ ఎమోష‌న్ అంద‌రికి క‌నెక్ట్ అవుతుంది. నిర్మాత సినిమాను ఎ\క్క‌డా రాజీప‌డకుండా చాలా స్మూత్ నిర్మించాడు. ప్ర‌తి ఒక్క‌రూ సీట్ఎడ్జ్‌లో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. ద‌ర్శ‌కుడు ఎంతో ప్ర‌తిభ‌తో చిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు. అంద‌రూ తమ సొంత సినిమాలా భావించి ఈ చిత్రానికి స‌పోర్ట్ చేశార‌ని, ఈ చిత్రాన్ని అనుకున్న బ‌డ్టెట్‌, రోజులు కంటే త‌క్కువ వ‌ర్కింగ్ డేస్‌లోనే పూర్తి చేశాన‌ని, ఈ సినిమాకు స‌త్యం రాజేష్ స‌పోర్ట్ మ‌రువ‌లేన‌ని ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్ తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌గానే చెయ్యాలి అని ఫిక్స్ అయిన సినిమా ఇది. అనుకున్న బ‌డ్జెట్ కంటే చాలా త‌క్కువ‌లోనే ఈ సినిమా పూర్తి చేశాడు. యుగంధ‌ర్ నిర్మాత‌ల ద‌ర్శ‌కుడు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మా సంస్థ‌కు మంచి పేరు తెస్తుంది అన్నారు. ఈ స‌మావేశంలో సాహిత్య సాగ‌ర్, జ‌మేన్ జామ్‌, భ‌ర‌త్‌కాంత్‌, చంద‌న‌, ఎస్తేర్‌, మేఘా చౌద‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES