‘ఎర్రచీర’ బేనర్ నుండి మరో కొత్త సినిమా జనవరి 27న ప్రారంభం!!

485


శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బేనర్ పై ప్రొడక్షన్ నెం 2గా బేబీ దమ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సి.హెచ్ సత్య సుమన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్ననూత‌న చిత్రం జనవరి 27 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత సి. హెచ్ సత్య సుమన్ బాబు మాట్లాడుతూ – ” ఒక ఐ.ఎ.ఎస్ అధికారి అవినీతి పై పోరాటం చేసి పూర్తిగా అవినీతిని ఎలా అంతమొందించారు అని తెలియ‌జెప్పే మంచి సందేశాత్మక చిత్రం ఇది. జనవరి 27 నుండి రెగ్యూల‌ర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కథ, మాటలు కె.బాలకిషోర్ అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ కుమార్. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఆ వివరాలుత్వరలోతెలియజేస్తాను”అన్నారు.

బేనర్: సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్,
స‌మ‌ర్ప‌ణ‌: బేబి ద‌మ‌రి,
నిర్మాత, దర్శకుడు: సి హెచ్ సత్య సుమన్ బాబు,
కథ, మాటలు: కె. బాలకిషోర్,
సంగీతం: ప్రమోద్ కుమార్.